కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీవో డిసెంబర్ 19, 2024న ప్రారంభమవుతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.500.33 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఫ్రెష్ షేర్ల ఇష్యూ మాత్రమే కాకుండా.. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉంటుంది.
ఐపీవో కోసం సబ్‌స్క్రిప్షన్ విండో 2024 డిసెంబర్ 19న ప్రారంభమై.. డిసెంబర్ 23తో ముగుస్తుంది. పెట్టుబడిదారులు షేర్ల కేటాయింపు డిసెంబర్ 24న ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 665 నుంచి రూ. 701 వరకు ఉండవచ్చు. పెట్టుబడిదారులు కనీసం 21 షేర్లను కలిగి ఉన్న ఒక లాట్‌కి వేలం వేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస పెట్టుబడి రూ.14,721. చిన్న నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కనీసం 14 లాట్‌ల (294 షేర్లు) కోసం దరఖాస్తు చేసుకోవాలి.
జూలై 1999లో ప్రారంభమైన కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్.. జీరో-లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) వంటి సాంకేతికతలతో సహా నీరు, మురుగునీటి శుద్ధి కోసం పరిష్కారాలను అందిస్తుంది. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని కలిగి ఉంది. ఇది నీటి పునర్వినియోగం కోసం స్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా పరిశ్రమలకు సేవలు అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment