ఇన్ఫీ ఇన్నోవేటర్స్ కంపెనీగా ఉండడం కష్టం!
ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోగా రాజీనామా చేసిన అనంతరం విశాల సిక్కా తొలిసారి స్పందించారు. ఇన్ఫోసిస్‌ను వీడడం తన జీవితంలో అతి బాధాకరమైన సంఘటన అని ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు. అనివార్య పరిస్థితుల కారణంగా రాజీనామా చేయక తప్పలేదన్నారు. అంతేకాదు ఇన్ఫోసిస్ ఇన్నోవేటర్ల కంపెనీగా ఉండటం కష్టమని అభిప్రాయపడ్డారు. కానీ ఐకానిక్ ఇన్ఫోసిస్ నిలిచి గెలుస్తుందని నొక్కి చెప్పారు.
ఇన్ఫోసిస్ సీఎండీగా పదవీ విరమణ చేసిన తరువాత తన మొదటి ముఖాముఖిళక్ష తన జీవితంలో అతి కష్టతరమైన నిర్ణయాలలో ఒకటి అంటూ తన రాజీనామాను గుర్తు చేసుకున్నారు. కానీ తనకు లభించిన మద్దతు, స్పందన చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఆ సమయంలో 72 గంటలలో కేవలం ఆరు గంటలపాటు నిద్రపోయానని సిక్కా తెలిపారు.
తన 50వ పుట్టిన రోజు సందర్భంగా తన గురువులాంటి, గొప్ప స్నేహితుడు ఇచ్చిన హెర్మాన్ హెస్సే పుస్తకంతోపాటు , జిడ్డుకృష్ణమూర్తి ఫ్రీడమ్ ఆఫ్ ది నోన్ పుస్తకాన్ని చదువుతున్నానని చెప్పారు. గతాన్ని మర్చిపోవడం ద్వారా కొత్తదనాన్ని ఆలింగనం చేసుకోవచ్చన్నారు. గతనుంచి స్వేచ్ఛ పొందడం మనల్ని మనం కొత్తగా అన్వేషించుకోవడానికి సాయ పడుతుదంటూ తాత్వికంగా మాట్లాడారు. ప్రస్తుతం తనకు కొంత సమయం కావాలనీ, దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన విషయాలపై దృష్టిపెట్టాలని అనుకుంటున్నానని చెప్పారు.ముఖ్యంగా పుస్తకాలను చదవాలనుకుంటున్నానని తన కుటుంబంతో సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
తనకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స అంటే మక్కువ ఎక్కువని చెప్పారు. ఈ స్ విప్లవం , సృజనాత్మక ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన ఈ బిగ్ ఎమర్జింగ్ ప్లాట్‌ఫాం(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) లో ఏదో సాధించాలని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ప్రపంచంలో మార్పుకు నాందిపలికేలా చేయాలనుకుంటున్నాను. అయితే ఏంటి అనేది ఇంకా ఏమి తెలియదు, కానీ ఆవైపుగా తన పయనం సాగనుందని సిక్కా తెలిపారు.
కాగా 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కృత్రిమ మేధస్సు (ఎఐ) లో పీహెచ్‌డీ చేశారు సిక్కా. సిలికాన్ వ్యాలీలో ఐ బ్రెయిన్, బోధా అనే రెండు సొంత సంస్థలను ప్రారంభించారు. ఆ సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి , మరో ఫౌండర్ నందన్ నీలేకని సిక్కాకు బిగ్ హీరోస్.