రూ.వెయ్యి కోట్ల జీఎంవీ సాధిస్తాం | It's quality that matters and not celebrity influence, says CashKaro | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్ల జీఎంవీ సాధిస్తాం

Published Thu, Aug 11 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

రూ.వెయ్యి కోట్ల జీఎంవీ సాధిస్తాం

రూ.వెయ్యి కోట్ల జీఎంవీ సాధిస్తాం

క్యాష్‌కరోడాట్‌కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పోర్టల్ ద్వారా రూ.1,000 కోట్ల మేర గ్రాస్ మర్చండైజ్ వాల్యూను (జీఎంవీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించే క్యాష్‌కరోడాట్‌కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ వెల్లడించారు. మూడేళ్ల క్రితం పోర్టల్ ప్రారంభించినప్పట్నుంచీ జీఎంవీ పరంగా (ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువ) ఏటా దాదాపు 300 శాతం మేర వృద్ధి సాధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  క్యాష్‌బాక్, కూపన్‌ల విభాగంలో తమకు దాదాపు 60 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో జరిగే అమ్మకాల్లో సుమారు 20-25% వ్యాపారం తమ తరహా అనుబంధ పోర్టల్స్ నుంచే ఉంటోందని స్వాతి వివరించారు. ప్రస్తుతం దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈకామర్స్ మార్కెట్ 2020 నాటికి దాదాపు 100 బిలియన్ డాలర్లకు పెరగగలదని, తదనుగుణంగా క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు అందించే సంస్థలకు పుష్కలంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఇప్పటిదాకా క్యాష్‌బాక్‌ల రూపంలో సుమారు రూ. 35 కోట్లు వినియోగదారులకు అందచేయగలిగామన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తదితర వెయ్యి ఈకామర్స్ సైట్లు తమ ప్లాట్‌ఫాంపై ఉన్నట్లు స్వాతి చెప్పారు.

విస్తరణపై దృష్టి
రుతున్న ఆన్‌లైన్ షాపింగ్ ధోరణులను ప్రస్తావిస్తూ గతంలో సింహభాగం ఎలక్ట్రానిక్స్‌దే ఉండగా.. ప్రస్తుతం ఇది 50 శాతం మేర  ఉంటుండగా, సుమారు పాతిక శాతం ఫ్యాషన్ల వాటా ఉంటోందని స్వాతి చెప్పారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, కలారి క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటి దాకా దాదాపు 5 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించినట్లు స్వాతి తెలిపారు. అటు బ్రిటన్‌లో పోరింగ్ పౌండ్స్ పేరిట క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పోర్టల్ నిర్వహిస్తున్న తాము త్వరలోనే సింగపూర్, ఆగ్నేయాసియా దేశాలకూ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం తమ పోర్టల్ ద్వారా అత్యధికంగా లావాదేవీలు జరిగే టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందని స్వాతి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement