జెట్ ఎయిర్ వేస్ బంపర్ ఆఫర్..
జెట్ ఎయిర్ వేస్ బంపర్ ఆఫర్..
Published Wed, Jun 7 2017 10:35 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
భారత మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుకూలంగా విమానయానసంస్థలు బంపర్ ఆఫర్లతో ప్రయాణికుల ముందుకొస్తున్నాయి. ఇటీవలే ఎయిర్ ఏషియా, ఇండిగో విమాన టిక్కెట్లపై రేట్లు తగ్గించగా.. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కూడా ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా ఎంపికచేసిన విమానాల్లో రూ.1,111కే టిక్కెట్ ను అందించనున్నట్టు పేర్కొంది. పరిమితి కాల వ్యవధిలో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. '' ఇట్స్ రైనింగ్ డీల్స్'' పేరుతో వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్లలో ఈ స్పెషల్ ధరలు అందుబాటులో ఉంటాయని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది. భారత్ లో జెట్ ఎయిర్ వేస్ ఆపరేట్ చేసే విమానాలకు ఈ స్పెషల్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. నేటి నుంచి జూన్ 9 వరకు ఈ డిస్కౌంటెడ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని జెట్ ఎయిర్ వేస్ చెప్పింది.
ఈ ఏడాది జూన్ 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు ప్రయాణాలకు ''ఇట్స్ రైనింగ్ డీల్స్ '' స్కీమ్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లను వాడుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద ఎన్ని సీట్లను అందుబాటులో ఉంచుతుందో జెట్ ఎయిర్ వేస్ పేర్కొనలేదు. ఎకానమీ క్లాస్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంటర్ లైన్, కోడ్ షేర్ విమానాలకు ఈ డిస్కౌంటెడ్ టిక్కెట్లు వర్తించవు. అచ్చం ఇలాంటి ఆఫర్ నే ఎయిర్ ఏషియా ఇండియా కూడా ప్రకటించింది. ఎంపికచేసిన రూట్లలో వన్-వే టిక్కెట్లను రూ.1,099కే అందించనున్నట్టు తెలిపింది. ఇండిగో కూడా గతవారం ఎంపికచేసిన వన్-వే ఫ్లైట్స్ లో రూ.899కే టిక్కెట్ ధరలను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.
Advertisement
Advertisement