చిదంబరం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
Published Tue, Feb 18 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
2014-15 మధ్యంతర బడ్జెట్ హైలైట్స్
మొత్తం బడ్జెట్ వ్యయం రూ.17,63,214 కోట్లు
{పణాళికా వ్యయం రూ.5,55,322 లక్షల కోట్లు
{పణాళికేతర వ్యయం రూ.12,07,892 కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ భారం రూ. 2,46,397 కోట్లు
రక్షణ బడ్జెట్ రూ.2.24 లక్షల కోట్లు(10%పెంపు)
ప్రధాన పథకాలకు శాఖలవారీగా కేటాయింపులు:
1. గ్రామీణాభివృద్ధి-రూ.82,200 కోట్లు
2. మానవ వనరుల అభివృద్ధి-రూ.67,398 కోట్లు
3. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం-రూ.33,725 కోట్లు
4. మహిళా, శిశు సంక్షేమం-రూ.21,000 కోట్లు
5. తాగునీరు, పారిశుధ్యం-రూ.15,260 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.48,638 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.30,726 కోట్లు
రైల్వేలకు రూ.29 వేల కోట్ల బడ్జెటరీ దన్ను
11 వేలకోట్లతో కేంద్ర సాయుధ బలగాల ఆధునీకరణ
{పభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనాన్ని సమకూర్చేందుకు రూ.11,200 కోట్లు
ఎస్సీ వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటల్ ఫండ్
ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పు లేదు. రూ.కోటి వార్షికాదాయమున్న సంపన్న వర్గాలపై 10 శాతం, రూ.10 కోట్ల టర్నోవరున్న సంస్థలపై 5 శాతం సర్‌చార్జీ కొనసాగుతుంది
సాయుధ బలగాలకు ‘ఒక ర్యాంకు, ఒకే పెన్షన్’. అందుకు 2014-15లో రూ.500 కోట్లు
నిర్మాణరంగానికి అన్ని ఎగుమతులపైనా పన్నుల రద్దు
2014-15లో లక్ష్యాలు
రూ.8 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల జారీ
{పభుత్వ నికర రుణాలు రూ.4.57 లక్షల కోట్లు
50 వేల మెగావాట్ల సంప్రదాయ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం
విదేశీ మారక నిల్వలను మరో 1,500 కోట్ల డాలర్ల మేరకు పెంచడం
వచ్చే దశాబ్ద కాలంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పన
2013-14లో సాధించినవి...
{దవ్య లోటు 2013-14లో 4.6 శాతం, 2014-15 అంచనా 4.1 శాతం
2013-14లో ఎగుమతుల అంచనా 32,600 కోట్ల డాలర్లు
{పస్తుత ఖాతా లోటు 4,500 కోట్ల డాలర్లు
2013-14 ఆర్థిక వృద్ధి అంచనా 4.9 శాతం
{పపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ది 11వ స్థానం
బలహీన వర్గాలకు 2013-14లో రూ.66,500 కోట్ల రుణాలు
రూ.6.6 లక్షల కోట్ల విలువైన 296 ప్రాజెక్టులకు జనవరి చివరి నాటికి ఆమోదం
2013-14లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రానికి రూ.88,188 కోట్ల డివిడెండ్. ఇది బడ్జెటరీ అంచనాల కంటే రూ.14,000 కోట్లు అదనం
2.1 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులకు రూ.3,370 కోట్ల నగదు బదిలీ
57 కోట్ల ఆధార్ కార్డుల జారీ
ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు రూ.1,200 కోట్లు అదనపు సాయం
కాలదోష రహితంగా రూ.1,000 కోట్ల నిర్భయ నిధి, అదనంగా మరో రూ.1,000 కోట్లు
తాయిలాలు:
స్వదేశీ మొబైల్ ఫోన్లపై ఎకై్సజ్ సుంకంలో కోత
చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలపై ఎకై్సజ్ సుంకం 4 శాతం తగ్గింపు. ఎస్‌యూవీలపై 6 శాతం, పెద్ద కార్లపై 3 శాతం, మధ్య తరహా కార్లపై 4 శాతం తగ్గింపు
2009 మార్చి 31కి ముందు తీసుకున్న విద్యార్థి రుణాల వడ్డీ చెల్లింపుపై మారటోరియం. 9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
బ్లడ్ బ్యాంకులకు సర్వీస్ ట్యాక్సు మినహాయింపు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు రీసెర్చ్ ఫండింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు
రూ.100 కోట్లతో కమ్యూనిటీ రేడియోకు ప్రోత్సాహం
Advertisement
Advertisement