ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్కూ మొండి బకాయిల సెగ
ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.407 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ.382 కోట్ల)తో పోల్చితే 7% వృద్ధి సాధించామని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. మొండి బకాయిల అధిక కేటాయింపు, వేతన సవరణ వల్ల నికర లాభంలో స్వల్ప వృద్ధే సాధించామని కంపెనీ ఎండీ, సీఈఓ సునిత శర్మ తెలిపారు. గత క్యూ1లో రూ.2,965 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,380 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.