ఒక్కో షేర్‌కు రూ.5.5 డివిడెండ్
న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.1,668 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.1,396 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.10,829 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,503 కోట్లకు పెరిగిందని తెలిపింది.
నిమ్ 27 శాతం అప్
గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌పై రూ.5.5 డివిడెండ్‌ను చెల్లించడానికి కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఈ డివిడెండ్‌ను ఈ ఏడాది ఆగస్టు 20 తర్వాత చెల్లిస్తామని తెలిపింది. ఇక స్టాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.378 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.448 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.2,861 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు ఎగిసిందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం రూ.650 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.822 కోట్లకు చేరిందని తెలిపింది.
కేటాయింపులు సీక్వెన్షియల్ ప్రాతిపదికన 9 శాతం, వార్షిక ప్రాతిపదికన 265 శాతం పెరిగి రూ.38 కోట్లకు చేరాయని వివరిం చింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 20% వృద్ధితో రూ.1,668 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం 31% వృద్ధితో రూ.3,090కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేర్ సోమవారం 1% వృద్ధితో రూ.485కు పెరిగింది.
ఎల్‌ఐసీ హౌసింగ్ లాభం 20% అప్
Published Tue, Apr 19 2016 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement
Advertisement