కనిష్టం నుంచి కోలుకున్న సూచీలు
* 215 పాయింట్ల లాభంతో 27,890కు సెన్సెక్స్
* 52 పాయింట్ల లాభంతో 8,430కు నిఫ్టీ
వరుస ఐదు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు బ్రేక్‌పడింది. బుధవారం స్టాక్ మార్కెట్ కోలుకుంది. యెమెన్‌లో సౌదీ అరేబియా మిలిటరీ దాడులు ముగియడంతో సెంటిమెంట్ మెరుగుపడింది. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుందడటంతో ఈ రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి.
సెన్సెక్స్ 215 పాయింట్లు లాభపడి 27,890 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 8,430 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందగలదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం కూడా దోహదపడింది. ఎఫ్‌ఐఐల పన్ను ఆందోళనలు, నిరాశమయ కంపెనీల ఆర్థిక ఫలితాలు బుధవారం నాటి ట్రేడింగ్‌పై కూడా ప్రభావం చూపాయి. సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షాలే కురిసాయన్న వాతావరణ శాఖ అంచనాలు స్వల్ప ప్రభావమే చూపాయి.