Banking shares
-
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్ ట్రేడింగ్ లాభాలన్నీ మాయమ య్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది. ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్‌లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్‌కు దన్నుగా నిలిచే వీలుంది’. – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ -
లాభాలు అందించిన బ్యాంకింగ్ షేర్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలను కళ్ల జూశాయి.ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగ సంస్థలు ముందుండి మార్కెట్‌ను నడిపించాయి. ఈ రోజు సెన్సెక్స్ 52,694 పాయింట్ల వద్ద ప్రారంభమై పైకి ఎగిసింది. ఒక దశలో గరిష్టంగా 5,806 పాయింట్లను టచ్ చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి 52,769 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. మొత్తానికి సెన్సెక్స్ 397 పాయింట్లు లాభపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 15,794 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత గరిష్టంగా 15,820 పాయింట్లను చేరుకుంది. చివరకు 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ముగిసింది. ఈ రోజు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్‌బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్స్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, మారూతి సుజూకి, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, టీసీఎస్ సంస్థల షేర్లు నష్టపోయాయి. -
Stock Market: నష్టాల్లోంచి.. లాభాల్లోకి..!
ముంబై: దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు గురువారం ఆరంభ నష్టాలను పూడ్చుకొని లాభాల్లో ముగిశాయి. కరోనా కేసుల కట్టడికి వచ్చే నెల(మే) ఒకటవ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను మెప్పించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా ఉదయం సెషన్లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 375 పాయింట్ల లాభంతో 48,081 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 110 పాయింట్ల లాభాన్ని మూటగట్టుకొని 14,406 వద్ద నిలిచింది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని చూపారు. మెటల్ షేర్లు కూడా రాణించి సూచీల ర్యాలీకి సహకరించాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభా ల్లో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 909 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.850 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఆరుపైసలు క్షీణించి 74.94 వద్ద స్థిరపడింది. ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి... కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలను దాటడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గు చూపడంతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది.సెన్సెక్స్ 204 పాయింట్ల నష్టంతో 47,502 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లను కోల్పోయి 14,219 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు దూకుడు మీదున్నా.., దేశీయంగా పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో విక్రయాల ఉధృతి మరింత పెరిగింది. దీంతో సెన్సెక్స్ 501 పాయింట్లు మేర నష్టపోయి 47,204 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లను కోల్పోయి 14,424 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆర్థిక, బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు మిడ్‌సెషన్ కల్లా నష్టాలను పూడ్చుకోగలిగాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో సూచీలు క్రమంగా లాభాలను ఆర్జించుకోగలిగాయి. ► హెచ్‌డీఎఫ్‌సీతో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 7% లాభంతో రూ.176 వద్ద ముగిసింది. ► నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఏడు శాతం పెరిగి రూ.453 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల విడుదల ముందు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 4% లాభపడి రూ.579 వద్ద నిలిచింది. నిఫ్టీ @ సిల్వర్ జూబ్లీ ... ఎన్ఎస్ఈలోని ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గురువారం అరుదైన ఘనతను సాధించింది. 1995 బేస్ ఇయర్ ప్రతిపాదికన 1996 ఏప్రిల్ 22 తేదీన 1,107 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన నిఫ్టీ దిగ్విజయంగా 25 వసంతాలను పూర్తి చేసుకుంది. కాంపౌండెడ్‌గా ప్రతి ఏటా 11 శాతం వృద్ధి చెందుతూ గడిచిన పాతికేళ్లలో 14 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న 15 వేల మార్కును అధిగమించింది. ఈ పాతికేళ్ల ప్రయాణంలో నిఫ్టీ ఇండెక్స్‌లో అనేక మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ.., హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో షేర్లు మాత్రం ఈ రోజుకు కొనసాగుతున్నాయి. -
రెండోరోజూ తడబాటే..!
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అస్థిరత కొనసాగింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 667 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ 20 పాయింట్లు పతనమై 51,309 వద్ద స్థిరపడింది. అలాగే ట్రేడింగ్ సమయంలో 15,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ సూచీ చివరికి మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ‘‘సూచీలు గరిష్ట స్థాయిలకు చేరుకోవడాన్ని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అవకాశంగా మలుచుకున్నారు. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లలో చెప్పుకొదగిన స్థాయిలో కొనుగోళ్లు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు ఇంట్రాడేలో భారీ ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. అమెరికా కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండటంతో అక్కడి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మన మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశంగా మారొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ తెలిపారు. కొనసాగిన ఒడిదుడుకులు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 51,356 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 15,119 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన కంపెనీ షేర్లు రాణించడంతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 184 పాయింట్లు పెరిగి 51,513 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 15,168 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సూచీల గరిష్టస్థాయిల వద్ద ఒక్కసారిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 667 పాయింట్లను నష్టపోయి 50,846 వద్దకు, నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే హై నుంచి 191 పాయింట్లు నష్టపోయి 14,977 స్థాయికి దిగివచ్చాయి. అయితే చివరి అరగంటలో ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
మార్కెట్‌కు వ్యాక్సిన్..!
వచ్చేది ‘నెవర్ బిఫోర్ బడ్జెట్’ అంటూ ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్‌కు మాత్రం బూస్టర్ డోస్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్ – 2021కు దలాల్ స్ట్రీట్ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఎన్పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్‌సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్లో లేకపోవడం మార్కెట్‌కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్ల కంటే అత్యధికంగా మార్కెట్‌ను ఆకట్టుకున్న బడ్జెట్ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్ బడ్జెట్’ రోజున స్టాక్ మార్కెట్ 6% ర్యాలీ చేసింది. 24 ఏళ్ల తరువాత సీతారామన్ తాజా బడ్జెట్ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్ 5% ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో సూచీలు ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 46,618 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల పెరుగదలతో 13,759 వద్ద మొదలయ్యాయి. ఆరురోజుల భారీ పతనం నేపథ్యంలో నెలకొన్న షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో సూచీలు ముందడుగు వేసేందుకే మొగ్గుచూపాయి. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోని అంశాలు ఒక్కొక్కటి మార్కెట్‌ను మెప్పిస్తుండటంతో సూచీల జోరు మరింత పెరిగింది. బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక వృద్ధికి ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమన్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా ఒక్క ఫార్మా తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 2478 పాయింట్లు పెరిగి 48,764 వద్ద, నిఫ్టీ 702 పాయింట్ల లాభంతో 14,336 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తుదిదాకా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో చివరికి సెన్సెక్స్ 2,315 పాయింట్లు పెరిగి 48,601 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281 వద్ద ముగిసింది. గతేడాది ఏప్రిల్ 7 తర్వాత సూచీలకిది ఒకరోజులో అతిపెద్ద లాభం కావడం విశేషం. సూచీల భారీ లాభార్జనతో గత ఆరు రోజుల్లో కోల్పోయిన మొత్తం నష్టాల్లో 60 శాతాన్ని తిరిగిపొందాయి. లాభాలే.. లాభాలు.. సీతమ్మ పద్దును స్టాక్ మార్కెట్ స్వాగతించడంతో బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు లాభాల వర్షంలో తడిసి ముద్దయ్యారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులో రూ.6.34 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. తద్వారా బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్క్యాప్ రూ.192.46 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రంగాల షేర్లు ఎందుకు దూసుకెళ్లాయంటే... ► బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీతో పాటు, ఆస్తుల నిర్వహణ కంపెనీల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా రూ.22 వేల కోట్ల రీ–క్యాపిటలైజేషన్ను ప్రకటించారు. ఫలితంగా ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు షేర్లు 15 శాతం నుంచి 11 శాతం లాభపడ్డాయి. ఆర్బీఎల్, యాక్సిస్, పీఎన్బీ, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 6 నుంచి 11 శాతం ర్యాలీ చేశాయి. ► జీవిత బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ఈ రంగానికి చెందిన షేర్లు 12 శాతం నుంచి 4 శాతం లాభపడ్డాయి. ► కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖకు ఈ ఏడాది రూ.1.80 లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ప్రకటించడంతో మౌలిక సదుపాయ రంగ కంపెనీలైన ఎన్సీసీ లిమిటెడ్, అశోకా బిల్డ్‌కాన్, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్చన్స్, దిలీప్ బిల్డ్‌కాన్ షేర్లు 14 శాతం నుంచి 5 శాతం లాభపడ్డాయి. ► కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామనే ప్రకటనతో ఆటో షేర్ల ర్యాలీ కొనసాగింది. కొత్త వాహనాలకు గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఆశలతో వాహన రంగ షేర్లు 10 శాతం వరకు లాభపడ్డాయి. వచ్చేది ‘నెవర్ బిఫోర్ బడ్జెట్’ అంటూ ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్‌కు మాత్రం బూస్టర్ డోస్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్ – 2021కు దలాల్ స్ట్రీట్ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఎన్పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్‌సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్లో లేకపోవడం మార్కెట్‌కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్ల కంటే అత్యధికంగా మార్కెట్‌ను ఆకట్టుకున్న బడ్జెట్ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్ బడ్జెట్’ రోజున స్టాక్ మార్కెట్ 6% ర్యాలీ చేసింది. 24 ఏళ్ల తరువాత సీతారామన్ తాజా బడ్జెట్ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్ 5% ఎగసింది. భారత ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ల డాలర్ల నుంచి 5 ట్రిలియన్ల డాలర్ల స్థాయికి పెంచేందుకు కేంద్ర బడ్జెట్ పునాది వేసింది. మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణాన్ని మరింత పరిపూర్ణం చేయనుంది. పీఎస్‌యూ బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్‌తో దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో స్థిరత్వం కోవిడ్ ఆర్థిక వృద్ధికి, ఈక్విటీ మార్కెట్లకు కలిసొస్తుంది. – విజయ్ చందోక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ బడ్జెట్ స్వరూపం వృద్ధి ప్రాధాన్యతను కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్‌కు దన్నుగా నిలిచే అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ, ఆటో స్క్రాపేజీ పాలసీ, అసెట్ మోనిటైజేషన్ అంశాలు మార్కెట్‌కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఫిబ్రవరి 5న వెలువడే ఆర్బీఐ పాలసీ విధాన ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది. – నీలేశ్ షా, కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్మెంట్ ఎండీ -
మూడోరోజూ రికార్డులే...
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడోరోజూ రికార్డుల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 227 పాయింట్లు లాభపడి తొలిసారి 44 వేల పైన 44,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 12,938 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంలో రూపాయి 27 పైసలు బలపడటం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, కరోనా వైరస్ వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతం వార్తలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలోసెన్సెక్స్ 262 పాయింట్లు లాభపడి 44,215 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 12,948 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, టెలికాం రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆర్థిక కంపెనీల యాజమాన్యాలు వెల్లడించిన అవుట్‌లుక్‌లో... ఆదాయాలతో పాటు, ఆస్తుల నాణ్యత మెరుగుపడతాయనే వ్యాఖ్యలతో ఈ రంగ షేర్ల ర్యాలీచేస్తున్నాయని మార్కెట్ నిపుణులంటున్నారు. ఇటీవల పతనాన్ని చవిచూసిన ఆటో షేర్లల్లో షార్ట్ కవరింగ్ జరిగినట్లు వారంటున్నారు. లక్ష్మీ విలాస్.. లోయర్ సర్క్యూట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆర్బీఐ పర్యవేక్షణలోకి వెళ్లిన లక్ష్మీ విలాస్ బ్యాంకు షేరు బుధవారం 20 శాతం నష్టపోయి రూ.12.40 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది. డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్ స్థిరత్వం, ఆర్థిక వ్యవహారాల పటిష్టతల దృష్ట్యా ఆర్బీఐ నెలరోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 6 శాతం లాభపడ్డ ఎల్అండ్టీ షేరు.... టాటా స్టీల్ నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకోవడంతో ఎల్అండ్టీ షేరు 6% లాభపడి రూ.1,148 వద్ద ముగిసింది. నాల్కో నుంచి మధ్యంతర డివిడెండ్... ప్రభుత్వ రంగ అల్యూమినియం తయారీ కంపెనీ నాల్కో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.0.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. మార్కెట్ రికార్డు ర్యాలీ నేపథ్యంలో అదానీ గ్యాస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జుబిలెంట్ పుడ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్, వైభవ్ గ్లోబల్స్ షేర్లు జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి. విప్రో బైబ్యాక్.. డిసెంబర్ 11 న్యూఢిల్లీ: ప్రతిపాదిత షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కి డిసెంబర్ 11 రికార్డ్ తేదీగా నిర్ణయించినట్లు ఐటీ సేవల సంస్థ విప్రో వెల్లడించింది. దీని కింద సుమారు రూ. 9,500 కోట్ల దాకా విలువ చేసే షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 400 రేటు నిర్ణయించింది. విప్రో గతేడాది సుమారు రూ. 10,500 కోట్ల దాకా విలువ చేసే షేర్ల బైబ్యాక్ నిర్వహించింది. మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ. 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారు. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో విక్రయాలు
మార్కెట్ ప్రారంభం నుంచి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ రంగాలకు చెందిన హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఫిన్ సర్వీసెస్ రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు కొనసాగుతున్నాయి. వాహన ఫైనాన్స్ విభాగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా రెండోరోజూ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. లాభాల స్వీకరణ కారణంగా ఆర్బీఎల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 3శాతం నుంచి 5శాతం నష్టాన్ని చవిచూశాయి. 4శాతం నష్టపోయిన ఎన్బీఎఫ్సీ స్టాక్‌లు: ఎన్బీఎఫ్సీ స్టాక్‌లు బజాజ్ ఫైనాన్షియల్ హోల్డింగ్, బజాజ్ ఫిన్‌సర్వీసెస్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్అండ్ఫైనాన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 4శాతం నష్టాన్ని చవిచూశాయి. కరోనా ఎఫెక్ట్‌తో స్వల్పకాలంలో నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ ఇప్పట్లో రికవరీ అయ్యే అవకాశం లేదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ మిడ్సమయానికి కల్లా 2.5శాతాన్ని నష్టాన్ని చవిచూసి 21,578 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 2.50శాతం పతనాన్ని చవిచూశాయి. -
‘ఆర్థిక’ షేర్లలో అమ్మకాలు
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 143 పాయింట్లు పతనమై 36,594 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,768 పాయింట్ల వద్ద ముగి శాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీపై ఆందోళనతో ఆసియా మార్కెట్లు పతనం కావడం, డాలర్ తో రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 75.20 చేరడం, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం.. ప్రతికూల ప్రభావం చూపించాయి. వారం పరంగా చూస్తే స్టాక్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 573 పాయింట్లు, నిఫ్టీ161 పాయింట్ల మేర పెరిగాయి. చివర్లో తగ్గిన నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. గంటలోపే రికవరీ అయి లాభాల్లోకి వచ్చింది. పట్టుమని పది నిమిషాలు కూడా ఈ లాభాలు కొనసాగలేదు. ఇక ఆతర్వాత రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో 11 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 337 పాయింట్లు పతనమైంది. ఇంట్రాడే నష్టాలు ట్రేడింగ్ చివర్లో తగ్గాయి. ఆర్ఐఎల్ లాభపడటంతో నష్టాలకు కళ్లెం పడింది. ► రిలయన్స్ జోరు కొనసాగుతోంది. రూ.1,884 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకిన ఈ షేర్ చివరకు 3% లాభంతో రూ.1,879 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. బీపీతో జేవీను ఏర్పాటు చేయడం, ఈ నెల 15న జరిగే కంపెనీ ఏజీఎమ్‌లో భారీ ప్రకటనలు ఉండొచ్చన్న అంచనాలు దీనికి నేపథ్యం. ► రూ.8,000 కోట్లు సమీకరిస్తున్న కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.8,000 కోట్ల మేర నిధులు సమీకరించ నున్నది. టైర్–1 బాసెల్ త్రి బాండ్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరిస్తామని కెనరా బ్యాంక్ తెలిపింది. ► యస్‌బ్యాంక్ ఎఫ్‌పీఓ ఫ్లోర్ ప్రైస్ రూ.12 యస్‌బ్యాంక్ తన ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ఫ్లోర్‌ప్రైస్‌ను రూ.12గా నిర్ణయించింది. శుక్రవారం నాటి ముగింపు ధర(రూ.25)తో పోల్చితే ఇది 55 శాతం తక్కువ. -
లాభనష్టాల... ఊగిసలాట
ఆద్యంతం లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన స్టాక్ సూచీలు గురువారం చివరకు అక్కడక్కడే ముగిశాయి. ఐటీ, ఇంధన, వాహన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నప్పటికీ, ఆర్థిక, విద్యుత్, ఫార్మా రంగ షేర్లు ఆదుకోవడంతో స్టాక్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 37,755 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 11,343 పాయింట్ల వద్దకు చేరాయి. స్టాక్ సూచీలు స్వల్పంగానే లాభపడినప్పటికీ, కీలకమైన స్థాయిలపైననే ముగియగలిగాయి. ఒక దశలో 156 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 58 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 214 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లు భళా.... ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పెరుగుతున్నాయి. డాలర్–రూపీ స్వాప్ యాక్షన్ మార్గంలో మూడేళ్లలో 500 కోట్ల డాలర్ల నిధులను ఆర్బీఐ అందించనుండటంతో రుణ వృద్ది మరింతగా మెరుగుపడుతుందనే భావనతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు గురువారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 29,070 పాయింట్లను తాకిన బ్యాంక్ నిఫ్టీ చివరకు 0.1 శాతం లాభంతో 28,923 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ విలువ దిగువకు ఆర్‌కామ్.... యాక్సిస్ ట్రస్టీస్ సర్వీసెస్ తన వద్ద తనఖాగా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి చెందిన 4.34 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించింది. దీంతో ఆర్‌కామ్ షేర్ ముఖ విలువ (రూ.5) కంటే తక్కువకు, రూ.4.65కు పడిపోయింది. ఆర్‌కామ్‌తో పాటు అనిల్ అంబానీకి చెందిన ఇతర కంపెనీ షేర్లు–రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ షేర్లు 2–7 శాతం రేంజ్లో పడిపోయాయి. -
బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి
న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయి. అందుకు సంబంధించి వారికి పూర్తి అనుమతులు ఇచ్చాం’’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గింపుతో సెబీ ‘కనీస ప్రజల వాటా’ నిబంధనలను పాటించేందుకు వీలవుతుందన్నారు. తగిన జాగ్రత్తలతో బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఇది ప్రోత్సహిస్తుందన్నారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రానికి 75%కి పైగా వాటా ఉండటం గమనార్హం. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా కనీసం 25% ఉండాలి. ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఇప్పటికే క్యూఐపీ ద్వారా రూ.20,000 కోట్ల మేర షేర్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఇది పూర్తయితే ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 58.53% నుంచి తగ్గుతుంది. సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకులు ఇప్పటికే ఉద్యోగులకు షేర్ల అమ్మకం ద్వారా నిధుల సమీకరణ చర్యలను చేపట్టాయి. దీని ద్వారా కూడా ప్రభుత్వం వాటా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. -
బ్యాంకింగ్ దెబ్బతో మార్కెట్లు ఢమాల్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్ చివరికి 265పాయింట్ల నష్టంతో 26,826 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 8609 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో మిడ్ సెషన్ నుంచి పెరిగిన భారీ అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్లు ఒక దశలో 332 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. నష్టాల్లో ఉన్న మార్కెట్లకు యూరప్ బలహీన సంకేతాలతో మరింత కుదేలైంది. అన్ని రంగాలూ నష్టపోగా, బ్యాంకింగ్ సెక్టార్ లోని అమ్మకాలు మార్కెట్‌ను ప్రభావితం చేసాయి. దీనికితోడు మెటల్స్, ఫార్మా, ఐటీ ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాలు కూడా క్షీణించాయి. ఫలితాల ప్రకటనతో యాక్సిస్ 8.3 శాతం కుప్పకూలగా, టాటా సంచలనంతో వరుసగా రెండో రోజు కూడా టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్, టీసీఎస్ లకు నష్టాలు తప్పలేదు. ఇదేబాటలో ఎస్ బీఐ, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, అరబిందో,లుపిన్, సిప్లా అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. మరోవైపు ఐడియా , కొటక్ బ్యాంక్, భారతీ, హీరో మోటో, మారుతీ, హెచ్‌యూఎల్ లాభపడ్డాయి. అటు రూపాయి స్వల్ప లాభంతో మొదలైన 0.01 పైసల నష్టంతో 66.83 వద్ద ఉంది. పసిడి కూడా రూ. 8 నష్టంతో పది గ్రా. రూ.29,934 వద్ద ఉంది. -
ఒడిదుడుకుల్లో స్వల్పలాభాలు
ముంబై :తీవ్ర ఒడిదుడుకుల అనంతరం బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ 47.81 పాయింట్ల లాభంతో 28,024 వద్ద ముగియగా.. నిఫ్టీ 25.15 పాయింట్ల లాభంతో 8,615వద్ద ట్రేడ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్ లాభాలను పండించగా.. డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు నష్టాలను గడించాయి. బ్యాంకు, ఆటో స్టాక్స్ నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లో నమోదయ్యాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.85 శాతం ఎగిసింది. మరోవైపు ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫలితాల్లో కుదేలైన డాక్టర్ రెడ్డీస్‌కు నేడు మార్కెట్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. షేర్లు 10.71శాతం పతనమై, రూ. 2,964గా ముగిసింది. నేడు నిఫ్టీలో టాప్ గెయినర్‌గా భారతీ ఎయిర్ టెల్ నిలిచింది. ఈ మొబైల్ టవర్ కంపెనీ క్యూ1 లాభాలను 71శాతం పెంచుకోవడంతో, షేర్లు 4.72శాతం లాభపడి, రూ.380.55గా క్లోజ్ అయ్యాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, యూనిటెడ్ స్పిరిట్స్ సైతం 2.38 శాతం, 4.40 శాతం ఎగిశాయి. అయితే జీఎస్టీ సవరణ బిల్లు ఈ పార్లమెంట్ సెషన్స్ లో 60శాతం ఆమోదం పొందుతుందనే మార్కెట్ విశ్లేషకుల అంచనాల నేపథ్యంలో మార్నింగ్ ట్రేడింగ్‌లో బెంచ్ మార్కు సూచీలు ఫుల్ జోష్‌లో నడిచాయి. నిఫ్టీ గతేడాది ఏప్రిల్ నాటి గరిష్టంలో ట్రేడ్ అవ్వగా.. బీఎస్ఈ సెన్సెక్స్ ఏడాది గరిష్టంలో 236 పాయింట్ల పైగా లాభాలను పండించింది. అనంతరం ప్రాఫిట్ బుకింగ్స్, ఇంట్రా ట్రేడ్ గెయిన్స్‌తో మార్కెట్లు పడిపోయి, తీవ్ర ఒడిదుడుకులో నడిచాయి. చివరికి మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.17 పైసలు లాభపడి, 67.18గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.85లు నష్టపోయి, రూ.30,827గా నమోదైంది. -
కనిష్టం నుంచి కోలుకున్న సూచీలు
* 215 పాయింట్ల లాభంతో 27,890కు సెన్సెక్స్ * 52 పాయింట్ల లాభంతో 8,430కు నిఫ్టీ వరుస ఐదు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు బ్రేక్‌పడింది. బుధవారం స్టాక్ మార్కెట్ కోలుకుంది. యెమెన్‌లో సౌదీ అరేబియా మిలిటరీ దాడులు ముగియడంతో సెంటిమెంట్ మెరుగుపడింది. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుందడటంతో ఈ రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 215 పాయింట్లు లాభపడి 27,890 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 8,430 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు ఆమోదం పొందగలదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం కూడా దోహదపడింది. ఎఫ్ఐఐల పన్ను ఆందోళనలు, నిరాశమయ కంపెనీల ఆర్థిక ఫలితాలు బుధవారం నాటి ట్రేడింగ్‌పై కూడా ప్రభావం చూపాయి. సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షాలే కురిసాయన్న వాతావరణ శాఖ అంచనాలు స్వల్ప ప్రభావమే చూపాయి. -
28,790 దిగువన కరెక్షన్
మార్కెట్ పంచాంగం రెండు వారాల్లో 12 శాతంవరకూ పెరిగిన బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ ఫలితంగా ప్రధాన స్టాక్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు గతవారం కరెక్షన్కు లోనయ్యాయి. అయితే ప్రధాన సూచీలు 2 శాతం వరకూ క్షీణించిన శుక్రవారంనాడు పలు ప్రధాన, మిడ్‌క్యాప్ షేర్లు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలోనూ, నెలల గరిష్టస్థాయిలోనూ ముగియడం మార్కెట్ అంతర్గతంగా బలపడుతున్నడానికి సంకేతం. ఇక ఈ వారం జరగనున్న ఆర్బీఐ సమీక్షలో మరోసారి రేట్లు తగ్గిస్తే మార్కెట్లో వెనువెంటనే బడ్జెట్ ర్యాలీ మొదలయ్యే అవకాశాలుంటాయి. రేట్లలో మార్పేదీ లేకపోతే బ్యాంకింగ్ షేర్లలో మరో రౌండు లాభాల స్వీకరణ జరగవచ్చు. ఫలితంగా మరో కొద్దిరోజులు మార్కెట్ దిద్దుబాటుకు లోనుకావొచ్చు. అటుపై బడ్జెట్‌పై అంచనాల్ని పెంచుకుంటూ నెమ్మదిగా ర్యాలీ బిల్డప్ అయ్యే ఛాన్స్ వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో తొలి మూడురోజులూ వరుసగా అప్‌ట్రెండ్ సాగించిన సెన్సెక్స్ చివరిరోజైన శుక్రవారం 29,844 పాయింట్ల రికార్డుస్థాయిని నమోదుచేసి, అక్కడ్నుంచి 29,070 కనిష్టానికి పడిపోయింది. వారంలో గరిష్ట, కనిష్టస్థాయిలు రెండూ అదేరోజు నమోదుకావడం విశేషం. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 96 పాయింట్ల స్వల్పనష్టంతో 29,183 వద్ద ముగిసింది. గత వారాంతంలో అమెరికా మార్కెట్లు క్షీణించిన ప్రభావంతో ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే సెన్సెక్స్‌కు 28,890 సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 28,790 మద్దతుస్థాయి సెన్సెక్స్‌కు కీలకం. ఇదే స్థాయి నుంచి జనవరి 21న భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ పెరిగినందున 28,790 దిగువన ముగిస్తేనే తదుపరి క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన మద్దతులు 28,325, 28,200 పాయింట్లు. వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ వారం 28,790 మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 29,400 వరకూ పెరగవచ్చు. ఆపైన 29,750 స్థాయికి ర్యాలీ జరిపే చాన్స్ ఉంది. 30,000 శిఖరాన్ని అందుకోవాలంటే 29,750 స్థాయిపైన సూచీ స్థిరపడాల్సివుంటుంది. నిఫ్టీ మద్దతు 8,690 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత శుక్రవారం 9,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కేవలం 4 పాయింట్లతో మిస్సయ్యింది. అదేరోజున 8,996 రికార్డుస్థాయి నుంచి 8,775 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 27 పాయింట్లు నష్టంతో 8,809 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ క్షీణిస్తే 8,690 వద్ద ప్రధాన మద్దతు లభిస్తున్నది. 8,690 దిగువన మద్దతుస్థాయిలు 8,575, 8,530 పాయింట్లు. ఆర్బీఐ పాలసీ ప్రకటనవెలువడిన తర్వాత 8,690 మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకోగలిగితే తిరిగి 9,000 స్థాయిని అందుకునే ప్రయత్నం చేయగలదు. ఈ వారం నిరోధస్థాయిలు 8,870, 8,960 పాయింట్లు. - పి. సత్యప్రసాద్ -
28,500పైన అప్‌ట్రెండ్ కొనసాగింపు
మార్కెట్ పంచాంగం రెండు వారాల పాటు గరిష్టస్థాయిలో ఒక చిన్న శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న భారత్ సూచీలు బ్యాంకింగ్ షేర్ల సహకారంతో గత శుక్రవారం రికార్డుస్థాయి వద్ద ముగిసాయి. ఎస్బీఐ ఫలితాలతో బుల్లిష్‌గా మారిన బ్యాంకింగ్ బుల్స్... కొటక్ మహీంద్రా బ్యాంక్-ఐఎన్జీ వైశ్యా విలీన ప్రకటనతో బ్యాంకు షేర్లను పరుగులు పెట్టించారు. డాలరుతో రూపాయి మారకపు విలువ 62 స్థాయికి పడిపోయినా, స్టాక్ సూచీలు పెద్ద ర్యాలీ జరపడం విశేషం. రూపాయి క్షీణత కూడా ఇన్వెస్టర్లకు షాక్నివ్వలేదంటే, మార్కెట్ అప్‌ట్రెండ్‌కు ఇప్పట్లో స్పీడ్‌బ్రేకర్ లేనట్లే. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... నవంబర్ 21తో ముగిసిన వారంలో కొత్త రికార్డుస్థాయి 28,360 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 288 పాయింట్ల లాభంతో 28,335 వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ల ర్యాలీ జరిపిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 28,500 స్థాయిని అందుకోవచ్చు. అటుపైన స్థిరపడితే 28,650 వద్దకు ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిని నిలబెట్టుకుంటే క్రమేపీ 28,800-28,900 శ్రేణికి చేరవచ్చు. ఈ సోమవారం 28,500 స్థాయిని అధిగమించలేకపోతే 28,280 వద్ద సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు లభించవచ్చు. ఆ లోపున 28,000 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 27,700-27,800 శ్రేణి వద్దకు తగ్గవచ్చు. గత రెండు వారాల నుంచి ఈ మద్దతు సహకరాంతో పలుదఫాలు సూచీ బౌన్స్ అయినందున, ఈ మద్దతు శ్రేణి సెన్సెక్స్‌కు ముఖ్యమైనది. నిఫ్టీ మద్దతు 8,400-నిరోధం 8,550 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,490 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపి, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 87 పాయింట్ల లాభంతో 8,477 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో 8,500పైన ప్రారంభమైతే 8,550 స్థాయివరకూ పెరగవచ్చు. గ్యాప్‌అప్‌స్థాయిపైన స్థిరపడలేకపోతే 8,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే 8,360 స్థాయి వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని బ్రేక్చేయడం ద్వారా కొత్త గరిష్టస్థాయికి చేరినందున, సమీప భవిష్యత్తులో 8,360 మద్దతు కీలకం. ఆ లోపున ముగిస్తే రెండు వారాల నుంచి మద్దతు కల్పిస్తున్న 8,290-8,320 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం 8,500-8,550 శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో బ్రేక్చేస్తే 8,650-8,700 శ్రేణి వద్దకు పెరగవచ్చు. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా 8,400 స్ట్రయిక్ వద్ద 66 లక్షల షేర్లతో అత్యధిక పుట్ ఆప్షన్ బిల్డప్, 8,500 స్ట్రయిక్ వద్ద 54 లక్షల షేర్లతో గరిష్టమైన కాల్ ఆప్షన్ బిల్డప్ జరిగింది. ఈ వారం 8,400-8,500 శ్రేణిని నిఫ్టీ ఎటువైపు ఛేదిస్తే, ఆవైపుగా సూచీ వేగంగా ప్రయాణించవచ్చని ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. -
బొగ్గు సంస్కరణల జోష్
146 పాయింట్లు అప్ 26,576 వద్దకు సెన్సెక్స్ వారం రోజుల గరిష్టం లాభాల్లో పవర్, మెటల్ బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయ్. దీంతో పవర్, మెటల్, బ్యాంకింగ్ షేర్లు వెలుగులో నిలిచాయి. ప్రభుత్వ సంస్థలకు నేరుగానూ, ప్రయివేట్ రంగ కంపెనీలకు ఈవేలం ద్వారానూ బొగ్గు గనుల కేటాయింపును చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయనుండటంతో సెంటిమెంట్ మెరుగుపడింది. ఇందుకు ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్లబాట పట్టడం కూడా జత కలిసింది. వెరసి సెన్సెక్స్ మరోసారి లాభాలతో మొదలైంది. ఆపై 26,615 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్లో ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకున్నప్పటికీ, చివర్లో మళ్లీ పురోగమించింది. ట్రేడింగ్ ముగిసేసరికి 146 పాయింట్ల లాభంతో 26,576 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 48 పాయింట్లు బలపడి 7,928 వద్ద నిలిచింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 576 పాయింట్లు జమ చేసుకుంది. జిందాల్ స్టీల్ జోరు: మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.5% జంప్‌చేయగా, సెన్సెక్స్ దిగ్గజాలు గెయిల్, సెసాస్టెరిలైట్, భెల్, విప్రో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, మారుతీ, భారతీ 4.5-2.5% మధ్య పుంజుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్, ఇండియాబుల్స్, ఫీనిక్స్ 6.5-2.5% మధ్య దూసుకెళ్లడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 2.6% లాభపడింది. కాగా, మరోవైపు బ్లూచిప్స్ ఓఎన్జీసీ, ఎం అండ్ఎం, కోల్ ఇండియా 2.5-1.5% మధ్య నష్టపోయాయి. -
నిఫ్టీ@6,700
రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్న స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ జోరు చూపాయి. 126 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 22,340 వద్ద నిలవగా, 54 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 6,696 వద్ద స్థిరపడింది. ఇవి కొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ ఇండెక్స్‌లు సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 6,702ను చేరగా, సెన్సెక్స్ 22,364 పాయింట్లను తాకింది. వెరసి ఈ వారంలో 585 పాయింట్లు జమచేసుకోగా, నిఫ్టీ ఖాతాలో 201 పాయింట్లు చేరాయి. గడిచిన నాలుగు రోజుల్లో దాదాపు రూ. 6,000 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 1,363 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 208 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులకుతోడు, రూపాయి మారకపు విలువ 60 దిగువకు పుంజుకోవడం, రానున్న ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు సెంటిమెంట్‌కు ఊపునిస్తున్నాయని విశ్లేషకులు వివరించారు. బ్యాంకింగ్ షేర్ల జిగేల్ బాసెల్-3 నిబంధనల అమలును రిజర్వ్ బ్యాంక్ ఏడాదిపాటు వాయిదా వేయడంతో బ్యాంకింగ్ షేర్ల జోరు మరింత పెరిగింది. ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, కెనరా, బీవోబీ, ఎస్బీఐ, యస్‌బ్యాంక్, ఫెడరల్, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ 9-2 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇక ప్రధానిగా మోడీపై అంచనాలతో అదానీ గ్రూప్ షేర్లు వెలుగులో నిలిచాయి. అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ 17-3 శాతం మధ్య జంప్ చేశాయి. మరోవైపు విద్యుత్ షేర్లు లాభాల వెలుగులు విరజిమ్మాయి. ఎన్‌హెచ్‌పీసీ, జేపీ పవర్, పీటీసీ, సీఈఎస్సీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, రిలయన్స్ పవర్ 8-4 శాతం మధ్య పురోగమించడంతో పవర్ ఇండెక్స్ అత్యధికంగా 3 శాతం ఎగసింది. రియల్టీకి డిమాండ్ ఏప్రిల్ 1న చేపట్టనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కఠిన విధానాలను వీడుతుందన్న అంచనాలు రియల్టీ షేర్లకు డిమాండ్‌ను సృష్టించాయి. ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూనిటెక్, డీబీ, అనంత్‌రాజ్, ఫీనిక్స్ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ జోష్ మిడ్ క్యాప్స్‌కు కూడా పాకడంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఐపీఎల్ టోర్నమెంట్ 7లో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగనుండటంతో ఇండియా సిమెంట్స్ షేరు 9% దూసుకెళ్లింది. ఇక మిడ్ క్యాప్స్‌లో వీఐపీ, కల్పతరు, బాంబే రేయాన్, ఎస్ఆర్ఎఫ్, జేకే సిమెంట్ 12-9 శాతం మధ్య పురోగమించాయి. -
యుద్ధ మేఘాలు ఉఫ్
యుద్ధ భయాలు తొలగడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ జోష్లోకొచ్చాయి. ఉక్రెయిన్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించేందుకు రష్యా నిర్ణయించడంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగుపడింది. వెరసి ఆసియా మొదలు, యూరప్, అమెరికా స్టాక్ ఇండెక్స్‌లు పుంజుకున్నాయ్. దీంతో గత ఏడు వారాల్లో లేని విధంగా సెన్సెక్స్ సైతం 263 పాయింట్లు ఎగసింది. 21,210 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఆరు వారాల గరిష్టంకాగా, 76 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 6,298 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 6,300ను అధిగమించింది. సెన్సెక్స్ ఇంతక్రితం జనవరి 13న మాత్రమే ఈ స్థాయిలో 376 పాయింట్లు ఎగసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ రంగాలు 3-2% మధ్య ఎగశాయి. ఎఫ్ఐఐల అండ... యుద్ధ వాతావరణం నేపథ్యంలోనూ ఎఫ్ఐఐలుపెట్టుబడులకే కట్టుబడటం దేశీయంగా సెంటిమెంట్‌కు బలాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. సోమవారం రూ. 198 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 186 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 345 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. ఇక డాలరుతో మారకంలో రూపాయి పుంజుకోగా, చమురు ధరలు బలహీనపడ్డాయి. మరిన్ని విశేషాలివీ... మెటల్ షేర్లలో హిందాల్కో 8% జంప్‌చేయగా, సెసాస్టెరిలైట్, హిందుస్తాన్ జింక్, ఎన్ఎండీసీ, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ 5-2.5% మధ్య పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌లో యస్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, కెనరా, ఎస్బీఐ 6-2% మధ్య పురోగమించాయి. క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లలో క్రాంప్టన్ గ్రీవ్స్, థెర్మాక్స్, భెల్, టాటా పవర్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ 4-2% మధ్య లాభపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ 2% చొప్పున లాభపడగా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే (నామమాత్రంగా) నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో హెచ్ఎంటీ, ఆషాహీ, ధనలక్ష్మీ బ్యాంక్, టిమ్కెన్, ఆస్ట్రాజెనెకా, బీఏఎస్ఎఫ్, శ్రేయీ ఇన్ఫ్రా, టాటా ఇన్వెస్ట్, అనంత్‌రాజ్, కోల్టేపాటిల్, టాటా కెమ్, ఐవీఆర్సీఎల్ తదితరాలు 16-8% మధ్య దూసుకెళ్లాయి. సహారా గ్రూప్ షేర్లు సహారా హౌసింగ్ ఫైనాన్స్, సహారా వన్మీడియా 4%పైగా పుంజుకున్నాయి. యూరప్ దూకుడు ఉక్రెయిన్-రష్యాల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఆవిరికావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు ఉపశమనం లభించింది. దీంతో యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, యూకే 2%పైబడ్డ లాభాలతో కదులుతున్నాయి. అంతకుముందు ఆసియా ఇండెక్స్‌లు సైతం సోమవారంనాటి నష్టాల నుంచి కోలుకున్నాయి. కాగా, వడ్డీ రేట్లపై యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రెండు రోజులపాటు సమావేశం కానుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్ల దృష్టి అటు మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు. కడపటి వార్తలందేసరికి అమెరికా స్టాక్ సూచీలు 1% లాభాలతో ట్రేడవుతున్నాయి.