30 వేల కోట్లకు ఎం-వాలెట్ మార్కెట్! | M-wallet market may reach Rs 30,000 cr by FY22: Study | Sakshi
Sakshi News home page

30 వేల కోట్లకు ఎం-వాలెట్ మార్కెట్!

Published Wed, Nov 23 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

30 వేల కోట్లకు ఎం-వాలెట్ మార్కెట్!

30 వేల కోట్లకు ఎం-వాలెట్ మార్కెట్!

అసోచామ్ నివేదిక
బెంగళూరు: దేశీ ఎం-వాలెట్ మార్కెట్ 141 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో 2022 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30,000 కోట్లకు చేరుతుందని అంచనా. దీనికి స్మార్ట్‌ఫోన్‌‌స వినియోగం పెరుగుదల, మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తి, ఈ-కామర్స్ రంగ జోరు, ఆదాయం వృద్ధి వంటి పలు అంశాలు కారణంగా నిలువనున్నారుు. పరిశ్రమ సమాఖ్య అసోచామ్, రీసెర్చ్ సంస్థ ఆర్‌ఎన్‌సీవోఎస్ సం యుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యారుు. నివేదికలోని ముఖ్యాంశాలివీ...

2015-16లో ఎం-వాలెట్ మార్కెట్ దాదాపు రూ.154 కోట్లుగా ఉంది.

దేశంలో ఎం-వాలెట్ల ద్వారా జరిగిన లావాదేవీల మార్కెట్ విలువ 2015-16 నుంచి 2021-22 నాటికి 154 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో రూ.20,600 కోట్ల నుంచి రూ.55 లక్షల కోట్లకు చేరుతుంది.

ఎం-వాలెట్ మార్కెట్‌లో మనీ ట్రాన్‌‌సఫర్ (వాలెట్-వాలెట్/వాలెట్-బ్యాంక్/బ్యాంక్-వాలెట్) 38% వాటాను.. మొబైల్, డీటీహెచ్, కరెంట్ వం టి బిల్లులు చెల్లింపులు 31% వాటాను.. ఆన్‌లైన్ షాపింగ్ 31% వాటాను ఆక్రమించారుు.

2015-16లో మొబైల్ పేమెం ట్స్‌లో 21 శాతంగా ఉన్న ఎం-వాలెట్ సర్వీసుల వాటా 2021-22 నాటికి 79%కి పెరుగుతుంది.

ఆర్‌బీఐ లెసైన్సింగ్ నిబంధనలు ఎం-వాలెట్ వృద్ధికి సహకరించేలా లేవు. వీటిని సవరించాలి.

అలాగే చాలా మంది యూజర్లు వైరస్, హ్యాకింగ్ వంటి పలు అంశాల పట్ల ఆందోళనతో ఉన్నారు. ఇది ఎం-వాలెట్ మార్కెట్ వృద్ధికి విఘాతం కలిగిస్తోంది. కంపెనీలు మంచి వృద్ధిని నమోదుచేయాలంటే ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement