వృద్ధి 7.8 శాతం: ఫిక్కీ సర్వే
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.8 శాతంగా నమోదవుతుందని ఆర్థికవేత్తలతో ఫిక్కీ నిర్వహించిన ఒక సర్వే పేర్కొంది. తగిన వర్షపాతం అంచనాలే దీనికి కారణమని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగం తగిన ఫలితాలు ఇవ్వడం వల్ల పారిశ్రామికవృద్ధీ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాలకు చెందిన వివిధ ప్రముఖుల అభిప్రాయాల ప్రాతిపదికన జూలై-ఆగస్టుల్లో ఫీక్కీ ఈ సర్వేను రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.6 శాతం వృద్ధిని ఆర్‌బీఐ అంచనావేస్తోంది. డిపాజిట్ల వృద్ధి రేటు 53 సంవత్సరాల కనిష్ట స్థాయి 9.9 శాతం వద్ద ఉండడం చూస్తుంటే.. ఈ రేట్లు తగ్గించడానికి బ్యాంకింగ్ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది.