ఈ ఏడాది వృద్ధి 6.5 శాతమే..!
• నోట్ల రద్దుతో జీడీపీపై తీవ్ర ప్రభావం
• మరింతగా వడ్డీ రేట్ల కోతకు అవకాశం
• డారుుష్ బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాతం స్థారుులోనే ఉండవచ్చని డారుుష్ బ్యాంక్ ఒక నివేదికలో అంచనా వేసింది. మరోవైపు, ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున, పాలసీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి క్రమంగా కోలుకుని 7.5 శాతం స్థారుుకి చేరవచ్చని వివరించింది. రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు నేపథ్యంలో డారుుష్ బ్యాంక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సమీప భవిష్యత్‌లో ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థారుులోనే ఉండొచ్చని, ప్రభుత్వం ప్రకటించిన తాత్కాలిక డీమానిటైజేషన్ కారణంగా ప్రస్తుత క్వార్టర్‌లో, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడగలదని డారుుష్ బ్యాంక్ తెలిపింది.
నివేదిక ప్రకారం అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో మందగమన ప్రభావాలను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ప్రజోపయోగ కార్యక్రమాలపై వ్యయం చేయడం మరింతగా పెంచే అవకాశం ఉంది. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఉదార ఆర్థిక విధానాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించవచ్చని నివేదిక పేర్కొంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రైవేట్ వినియోగం కోలుకోవచ్చని తెలిపింది. ఈ చర్యల ఊతంతో 2017-18లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5% స్థారుులో ఉండగలదని వివరించింది.
5 శాతం దిగువనే ద్రవ్యోల్బణం
వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో 5% కన్నా దిగువనే కొనసాగవచ్చని, తద్వారా వడ్డీ రేట్ల కోతకు కొంత ఆస్కారం ఉండగలదని డారుుష్ బ్యాంక్ తెలిపింది. వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాల దరిమిలా డిసెంబర్ 7న జరిగే పాలసీ సమీక్ష సమావేశంలో ఆర్‌బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పారుుంట్లు, వచ్చే ఏడాది అదనంగా మరో 50 బేసిస్ పారుుంట్ల మేర తగ్గించవచ్చని పేర్కొంది. ‘25 బేసిస్ పారుుంట్ల చొప్పున ఫిబ్రవరిలో (బడ్జెట్ తర్వాత) ఒకసారి, ఏప్రిల్‌లో (వార్షిక పాలసీ సమీక్షలో) మరోసారి ఆర్‌బీఐ రేట్లు తగ్గించవచ్చు’ అని డారుుష్ బ్యాంక్ వివరించింది.
స్వల్పకాలికంగా ప్రతికూలం: ఫిచ్
నోట్ల రద్దు పరిణామం.. స్వల్పకాలికంగా భారత్ వృద్ధిపై కాస్త ఎక్కువగానే ప్రతికూల ప్రభావం చూపినా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఒక మోస్తరుగానే ఉండొచ్చని ఫిచ్ రేటింగ్‌స పేర్కొంది. మధ్యకాలికంగా మాత్రం భారత్ జీడీపీ వృద్ధి చైనాను మించి నమోదు కాగలదని వివరించింది. సంస్కరణలు, పాలసీ రేట్ల తగ్గుదల తదితర అంశాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింతగా పుంజుకోగలదని ఫిచ్ తెలిపింది. నగదు కొరత కారణంగా వినియోగం, పెట్టుబడుల రాకకు కొంత జాప్యం జరగవచ్చని, ఉత్పాదకత కాస్త తగ్గడం, సరఫరాపరమైన సమస్యలు తలెత్తడం, రైతులు పంటలకు అవసరమైన ముడివస్తువులు కొనుగోలు చేయలేకపోవడం మొదలైన తాత్కాలిక పరిణామాలు చోటుచేసుకోవచ్చని పేర్కొంది. ఇక డీమానిటైజేషన్ వల్ల చేకూరే లబ్ధిని ప్రస్తావిస్తూ.. మరింత ఆదాయాలతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగలవని ఫిచ్ వివరించింది.