సాక్షి, న్యూఢిల్లీ : మహీంద్రా కంపెనీ తన మోజో బైక్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మహీంద్ర మోజో యూటీ 300 బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు ఏకంగా రూ.75 వేల తగ్గింపును పొందవచ్చు. ముఖ్యంగా మహీంద్రా కంపెనీలో పని చేసే ఉద్యోగులకైతే రూ.75వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందుతుంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఆఫర్‌ని వినియోగించుకోవాలని కంపెనీ కోరుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్ర డీలర్ ద్వారా అయితే రూ.40 వేల డిస్కౌంట్ అందుతుంది. అలాగే పాత బైక్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.60వేలడిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు టూవీలర్ సెగ్మెంట్‌లో జావా బైక్స్ ఎంట్రీ మోజో బైక్ విక్రయాలను దెబ్బతీసింది. అటు మోజో బైక్ ధర భారీగా ఉండడటంతో కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. దీంతో ఈ బైక్ తయారీని నిలిపివేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే భారీ స్థాయిలో డిస్కౌంట్‌ని అందిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం మోజో బైక్ ప్రధానంగా రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. యూటీ 300, ఎక్స్‌టీ 300పేర్లతోఅందుబాటులో ఉన్న ఈ రెండింటిలో యూటీ 300 ధర తక్కువ. యూటీ 300 ధర రూ.149 లక్షలు కాగా, ఎక్స్‌టీ 300 ధర రూ.1.79 లక్షలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment