* ప్రభావం చూపిన ఐఐపీ జోరు
* 8,800 దాటిన నిఫ్టీ
* 165 లాభంతో 29,044కు సెన్సెక్స్
* 54 లాభంతో 8,834కు నిఫ్టీ
* మార్కెట్ అప్‌డేట్
ముంబై: స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. చివరి రెండు గంటల్లో కొనుగోళ్ల జోరు కారణంగా సెన్సెక్స్ 29,000, నిప్టీ8,800 పాయింట్ల పైన ముగిశాయి.
ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)గణాంకాలు అంచనాలను మించి, తొమ్మిది నెలల గరిష్టానికి చేరడం కూడా ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్ సూచీలు నెల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 29,044 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లాభంతో 8,834 వద్ద ముగిశాయి.
ఫలితాలను బట్టే గమనం
సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. కొనుగోళ్ల జోరుతో 29,000 పాయింట్లను దాటింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 28,844 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో 29,073 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 165 పాయింట్ల లాభంతో 29,044 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8,842,8,762 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి నిఫ్టీ 8,834 పాయింట్ల వద్ద ముగిసింది.
ట్రేడింగ్ తర్వాత వెలువడిన వినియోగదారుల ధరల సూచీ, రేపు(మంగళవారం) వెలువడనున్న టోకు ధరల సూచీ గణాంకాలు నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు. .మార్కెట్ భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. 1,703 షేర్లు లాభాల్లో 1,124 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,080 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.16,355కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,84,139 కోట్లుగా నమోదయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.417 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.46 కోట్లు చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు.
29,000 దాటిన సెన్సెక్స్
Published Tue, Apr 14 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement