
మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 42 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో ఇంటర్నెట్ వినియోగించే యూజర్ల సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికి 42 కోట్లకు చేరుతుందని ఐఏఎంఏఐ అంచనా వేసింది. పట్టణ ప్రాంత యూజర్ల నెలవారీ డేటా వ్యయం కనీసం రూ.275గా ఉంటుందని పేర్కొంది. 42 కోట్ల మంది యూజర్లలో పట్టణ ప్రాంతానికి చెందిన వారు 25 కోట్ల మంది, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు 17 కోట్ల మంది ఉంటారని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్స్, డేటా చార్జీలు తక్కువగా ఉండటం వంటి పలు అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వివరించింది.