హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ రిటైల్ మొబైల్స్ విక్రయంలో ఉన్న సెలెక్ట్ మొబైల్స్ ‘సి–సేఫ్’ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. సెలెక్ట్ స్టోర్లలో కొన్న మొబైల్స్ భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీ నాలుగు రకాల ఉత్పాదనలను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్ సి–సేఫ్ సిల్వర్ కార్డును ఎంచుకుంటే మొబైల్‌పై ఒక ఏడాది ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తారు. రూ.199లతో పీపీ30 గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే 30 రోజుల్లో ఫోన్ స్క్రీన్ పగిలితే కొత్తది వేస్తారు. డ్యామేజీ ప్రొటెక్షన్ కోసం ఉద్ధేశించిన పీపీ180 కార్డు ఆరు నెలలు పనిచేస్తుంది. అలాగే ప్లాటినం కార్డులో భాగంగా ఆరు నెలల డ్యామేజీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక ఏడాదిపాటు ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఇస్తామని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. కొనుగోలు చేసే మొబైల్ ఆధారంగా చార్జీ ఉంటుందని వెల్లడించారు. వినియోగదార్లు సి–సేఫ్ యాప్ ద్వారా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఐటీ సేవలు 10% వృద్ధి..!
హైదరాబాద్: దేశీ ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర వృద్ధి రేటును నమోదుచేయవచ్చని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈసీఎస్) అంచనావేసింది. ఆర్‌బీఐ నుంచి పూర్తి సమాచారం అందే వరకు కచ్చితమైన మొత్తాన్ని లెక్కించడం కష్టమని కౌన్సిల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డీ కే సరీన్ అన్నారు. అయితే, పేర్కొన్న మేరకు వృద్ధి అంచనా ఉందన్నాయన. సోలార్ ఎలక్ట్రానిక్స్, యూపీఎస్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్ల అభివృద్ధి నేపథ్యంలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఎగుమతులు సైతం 7–8 శాతం వృద్ది నమోదుచేయవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment