బేయర్ కు మోన్ శాంటో ఝలక్ | Monsanto rejects Bayer $62 bn bid as 'financially inadequate' | Sakshi
Sakshi News home page

బేయర్ కు మోన్ శాంటో ఝలక్

Published Wed, May 25 2016 10:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

Monsanto rejects Bayer $62 bn bid as 'financially inadequate'

జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్ కు అమెరికా సీడ్స్ కంపెనీ మోన్ శాంటో ఝలక్ ఇచ్చింది. బేయర్ ప్రకటించిన 6200 కోట్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ ను తిరస్కరించింది. ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో ప్రకటించింది. అయితే ఈ విలీనంపై మరిన్ని చర్చలు జరుపుతామని మోన్ శాంటో తెలిపింది. గతకొంతకాలంగా జరిపిన చర్చల అనంతరం బేయర్ ఈ ఆఫర్ ను మోన్ శాంటోకు ప్రకటించింది.

ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హంగ్ గ్రాంట్ మంగళవారం తెలిపారు. ఈ ఫైనాన్స్ డీల్ పై కానీ, రెగ్యులేటరీ సవాళ్లను ఎదుర్కోవటంపై కానీ సరియైన హామీని బేయర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. బేయర్ ప్రతిపాదన అసంపూర్తిగా, ఆర్థికంగా తగినవిధంగా లేదని మోన్ శాంటో బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన తెలిపారు. కానీ ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగించడానికి మోన్ శాంటో షేర్ ఓనర్స్ ఆసక్తి చూపినట్టు కంపెనీ ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్స్, వ్యవసాయ పురుగుమందులు, జెనరిక్ గా పంటలను ఎప్పడికప్పుడూ మార్చగల సామర్థ్యం గల కంపెనీగా ఆవిర్భవించడానికి మోన్ శాంటోకు బేయర్ ఈ అతిపెద్ద టేకోవర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ను మోన్ శాంటో తిరస్కరించడంతో, బేయర్ ఈ బిడ్ విలువను మరింత పెంచుతుందా అనేది మార్కెట్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే బేయర్ ఈ ఆఫర్ తో మోన్ శాంటో షేర్లు బలపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం అంతర్జాతీయ ట్రేడింగ్ లో మోన్ శాంటో షేర్లు 1.7శాతం పెరిగి, 107.77 డాలర్లుగా నమోదయ్యాయి.  కానీ ఈ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి బేయర్ షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. మోన్ శాంటో ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు మార్కెట్లోకి వార్త పొక్కడంతోనే బేయర్లు షేర్లు పునఃస్థానానికి వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement