
ముకేశ్ అంబానీ వేతనం 8వ ఏడాదీ రూ.15 కోట్లే!
న్యూఢిల్లీ : భారత్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదవ ఏడాది 2015-16 సంవత్సరంలోనూ రూ.15 కోట్ల వేతనమే తీసుకున్నారు. ఆమోదిత మొత్తం రూ.38.75 కోట్లు అయినా... రూ.15 కోట్లను ఆయన తీసుకున్నట్లు 2015-16 వార్షిక నివేదికలో ఆర్‌ఐఎల్ తెలిపింది. ఉన్నత నిర్వహణ స్థాయిలో వేతనాల నియంత్రణకు సంబంధించి ఉదాహరణగా నిలుస్తూ... ఆయన ఈ తక్కువ వేతనం పొందేందుకు తనకుతాను నిర్ణయం తీసుకున్నారు. సంస్థ బోర్డ్‌లోని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల వేతనం భారీగా పెరుగుతున్నా... ముకేశ్ తన నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.