రిలయన్స్‌ జియో మరో సంచలనం |  Mukesh Ambani  Reliance Jio ranked India 2nd most popular brand after Google  says survey | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో మరో సంచలనం

Published Fri, Jun 7 2019 6:55 PM | Last Updated on Fri, Jun 7 2019 8:41 PM

 Mukesh Ambani  Reliance Jio ranked India 2nd most popular brand after Google  says survey - Sakshi

సాక్షి, ముంబై :  ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో రికార్డును  సొంతం చేసుకుంది. జియో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో  రెండవ స్థానాన్ని పొందింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.  సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను వెనక్కి  నెట్టి మరీ  ఈ ఘనతను సాధించింది జియో​.  ఐపోసిస్ 2019 సర్వే  లెక్కల ప్రకారం  మరో టెలికాం దిగ్గజం, జియో ప్రధాన పోటీదారు భారతి ఎయిర్‌టెల్‌  ఎనిమిదవ స్థానం సంపాదించింది.  గత ఏడాది సర్వేలో భారత్‌లోని మోస్ట్ పాపులర్ బ్రాండ్‌ జాబితాలో  తొలి రెండు స్థానాల్లో గూగుల్, ఫేస్‌బుక్ నిలవగా రిలయన్స్ జియో మూడో స్థానంలో నిలిచింది.

2016 టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. 30 కోట్లకు పైగా యూజర్లతో  జియో సంచలనం సృష్టించగా,  తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.  కాగా  టాప్ టెన్‌లో టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు నిలవడ మరో విశేషం. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం మూడవ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌ నాలుగు, జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ ఐదవ స్థానం దక్కించుకున్నాయి. లోకల్ బ్రాండ్స్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషమని  ఐపోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా (బిజినెస్ హెడ్, ముంబై)  చెప్పారు.  

ఇక టాప్ 5లో గ్లోబల్ బ్రాండ్స్‌ తో పోటీపడి  దేశీయ బ్రాండ్స్ తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే టాప్ 10లో నాలుగు దేశీయ బ్రాండ్స్ నిలిచాయి. రిలయన్స్ జియో, పేటీఎంలతో పాటు ఎయిర్‌టెల్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. శాంసంగ్ 6వ స్థానంలో, బిల్‌గేట్స్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో, యాపిల్ ఐఫోన్ 9వ స్థానంలో నిలిచాయి. ఎయిర్‌టెల్ 8వ స్థానంలో, ఫ్లిప్‌కార్ట్ 10వ స్థానంలో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement