మూర్తిదే పైచేయి: ఇన్ఫీకి కో-చైర్మన్
మూర్తిదే పైచేయి: ఇన్ఫీకి కో-చైర్మన్
Published Thu, Apr 13 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
ముంబై : వేతన ప్యాకేజీ విషయంలో ఇటీవల ఇన్ఫోసిస్ లో నెలకొన్న వివాదం తెలిసిందే. బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు అసలు పడటం లేదు. కంపెనీ గవర్నెర్స్ విషయంలో ఇప్పటికే పలుమార్లు కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు హెచ్చరికలు కూడా చేశారు. కాగ, ఈ విషయంలో కంపెనీ చైర్మన్ శేషసాయిపై నారాయణమూర్తినే పైచేయి సాధించారు. స్వతంత్ర బోర్డు సభ్యుడు రవి వెంకటేశన్ ను కంపెనీ కో-చైర్మన్ గా నియమించేలా చేశారు.
కంపెనీలో కార్పొరేట్ పాలన విషయంలో వివాదం నెలకొన్న అనంతరం మూర్తితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపిన కీలక వ్యక్తులే వెంకటేశన్ ఒకరు. కంపెనీ గవర్నెర్స్ లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు నేపథ్యంలో చైర్మన్ శేషసాయికి కో-చైర్మన్ గా మరో కీలక వ్యక్తిని నియమించాలని మూర్తి ఆదేశించారు. కంపెనీ వ్యూహాలను అమలు చేస్తూ మేనేజ్ మెంట్ కు సపోర్టు చేయడానికి రవి తనకు సాయపడతాడని శేషసాయి తెలిపారు.
ఇన్ఫోసిస్ అంతకమునుపు కూడా మూర్తి రికమెండ్ చేసిన డీఎన్ ప్రహ్లాద్ ను బోర్డులోకి తీసుకుంది. వెంకటేశన్ ప్రస్తుతం బ్యాంకు ఆఫ్ బరోడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాప్ట్ ఇండియాకు మాజీ చైర్మన్ ఇతను. టెక్నాలీజ ఇండస్ట్రీకి ఇది ఎంతో ఉత్తేజకరమైన సమయంని, శేష, విశాల్, టీమ్ తో వర్క్ చేసే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషానిస్తుందని రవి వెంకటేశన్ చెప్పారు. కంపెనీలో నెలకొన్న పరిణామాలకు బాధ్యత వహించాలని పేర్కొంటూ ఇప్పటికే పలువురు శేషసాయిని రాజీనామా చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు.
Advertisement