నాన్-లైఫ్ బీమా ప్రీమియం వసూళ్లు 86% అప్ | Non-Life Insurance Premium Soars 86% In September | Sakshi
Sakshi News home page

నాన్-లైఫ్ బీమా ప్రీమియం వసూళ్లు 86% అప్

Published Tue, Nov 1 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

నాన్-లైఫ్ బీమా ప్రీమియం వసూళ్లు 86% అప్

నాన్-లైఫ్ బీమా ప్రీమియం వసూళ్లు 86% అప్

న్యూఢిల్లీ: నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల స్థూల ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్ నెలలో 86.2% పెరుగుదలతో రూ.14,950 కోట్లకు ఎగసాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ. 8,030 కోట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏ గణాంకాల ప్రకారం.. మొత్తం ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల వాటా రూ.9,164 కోట్లుగా, ప్రైవేట్ కంపెనీల వాటా రూ.5,786 కోట్లుగా ఉంది.
 
 ప్రభుత్వ రంగంలోని యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,797 కోట్లు (105% వృద్ధి)గా, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,332 కోట్లు (78% వృద్ధి), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం వసూళ్లు రూ.945 కోట్లు(8% వృద్ధి)గా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,554 కోట్లు (27% వృద్ధి) ఉన్నాయి. ఇక 23 ప్రైవేట్ కంపెనీల్లో.. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ప్రీమియం వసూళ్లు రూ.976 కోట్లు (3 రెట్లు వృద్ధి)గా, ఐసీఐసీఐ లంబార్డ్ ప్రీమియం వసూళ్లు రూ.998 కోట్లు (58% వృద్ధి)గా  నమోదయ్యాయి.
 
 ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కొత్త ప్రీమియం ఆదాయం రూ.2,000 కోట్లు
 దక్షిణ సెంట్రల్ జోన్‌కు సంబంధించి ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం అక్టోబర్‌లో 67% వృద్ధితో రూ.2,035 కోట్లకు చేరింది. దక్షిణ సెంట్రల్ జోన్ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు వస్తాయి. ఎల్‌ఐసీకి దేశంలో ఉన్న 8 జోన్‌లలోనూ మొత్తం ప్రీమియం ఆదాయంపరంగా దక్షిణ సెంట్రల్ జోన్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు జోనల్ మేనేజర్ టి.సి. సుశీల్‌కుమార్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement