సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు వాణిజ్యలోటు అందోళన పెరుగుతోంటే అక్టోబర్ నెల నాటి గణాంకాలు మరింత ఆందోళన కరంగా వెలువడ్డాయి. అక్టోబరు వాణిజ్య లోటు 17.13 బిలియన్ డాలర్లకు పెరిగింది. అధిక ఆయిల్ ఇంపోర్ట్ బిల్ వాణిజ్య లోటు విస్తరించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబరులో వాణిజ్య లోటు 13.98 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబర్ నెలలో ఎగుమతులు 17.86 శాతం పెరిగి 26.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.దిగుమతులు 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముడి దిగుమతిదారు ఇండియా, విదేశీ మార్కెట్ల నుండి చమురును 80 శాతం కొనుగోలు చేస్తోంది. అక్టోబర్ నెలలో దేశంలో చమురు దిగుమతులు 14.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరం 52.64 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment