కోవిడ్‌-19..పర్సనల్‌ లోన్లు తీసుకుంటున్నారా..? | personal finance lones in covid-19 | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19..పర్సనల్‌ లోన్లు తీసుకుంటున్నారా..?

Published Mon, May 25 2020 12:12 PM | Last Updated on Mon, May 25 2020 1:01 PM

personal finance lones in covid-19 - Sakshi

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా సాధారణ జీవన స్థితిగతులు గతి తప్పాయి. ముఖ్యంగా సగటు సామాన్య భారతీయుడి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు తీవ్రం దెబ్బతిన్నాయని స్టేబుల్‌ ఇన్వెస్టర్‌ డాట్‌కమ్‌ వ్యవస్థాపకులు దేవ్‌ ఆశిష్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఆయా కంపెనీల ఆదాయాలు భారీగా పతనమవ్వడంతో చాల మంది ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం, వేతనాలు చెల్లింపులను సదరు కంపెనీలు వాయిదా వేయడం జరిగింది. దీంతో సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది. భారతీయ మార్కెట్లలో నగదు ప్రవాహం క్షీణించింది. ఈ సమస్యను కొంతమేర పరిష్కరించేందుకు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) స్వల్ప వడ్డీరేట్లతో కూడిన వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయని దేవ్‌ తెలిపారు. ఈ రుణాలు 7.25 శాతం తక్కువ వడ్డీ రేటుతో ప్రారంభమవుతున్నాయి. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు 7.25-8.25 శాతం వడ్డీతో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. వీటిని కోవిడ్‌-19 వ్యక్తిగత రుణాలుగా పిలుస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి ఈలోన్లు కొంత మేర ఆదుకుంటాయన్నారు.

రుణాలు ఎవరికి అవసరం..?
ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రకాల వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వేతనాలు రానీ వారు, జీతాల్లో కోతలకు గురైనవారు, సొంతవ్యాపారాల్లో ఆదాయాన్ని భారీగా కొల్పోయిన వారు ఒక వర్గం కాగా, ఇప్పటికీ కనీస వేతనాలు లేనివారు, అతితక్కువ జీతాలు తీసుకుంటున్నవారు మరో వర్గంగా ఉన్నారు.మొదటి వర్గంలో ఉన్నవారికి సాయం దొరికితే సరిపోతుంది. ఎందుకంటే వీరికి కొంత మేర జీతం రావడం, వాయిదా వేసిన జీతం రెండు మూడు నెలల కాలంలో వస్తుంది. ఆ మాత్రం దానికి రుణాలు తీసుకోవాల్సి అవసరం లేదన్నారు. ఇక రెండో వర్గంలో ఉన్న వారికి తక్కువ వడ్డీతో లభిస్తున్న వ్యక్తిగత రుణాలు తీసుకోవడం మంచిదని దేవ్‌ సూచిస్తున్నారు. తక్కువ వేతనాలు పొందుతున్నవారు వారి దైనందిన ఖర్చులకు ఆ జీతం సరిపోదు. దాంతో వారి వద్ద సేవింగ్స్‌కానీ, దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవీ ఉండవు. ఈసమయంలో వచ్చే కాస్త జీతం కూడా రాకపోతే వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది. అందువల్ల ఇటువంటి వారికి వ్యక్తిగత రుణాలు కొంత మేర ఆర్థిక ఉపశాంతిని కలిగిస్తాయన్నారు.

కోవిడ్‌-19 వ్యక్తిగత రుణాలు..
క్రెడిట్‌స్కోరు మంచిగా ఉన్న కస్టరమ్లకు ఈ రుణాలు లభిస్తున్నాయి. ఈ రుణాల్లో వడ్డీ రేట్లను మరికొంత తగ్గించినట్లయితే కస్టమర్లకు చాలా సహాయపడుతుందన్నారు. క్రెడిట్‌ ట్రాక్‌ రికార్డ్‌ మంచిగా లేనివారికి ఈ రుణాలు ఇవ్వరు. ఇప్పటికే చాలా ఏళ్లుగా ఆయా బ్యాంకుల్లో ఎన్‌పీఏలు చాలానే ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు ఉన్నప్పటికీ ఎన్‌పీఏల వల్ల కొంత వెనకడుగు వేస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి సైతం మారటోరియం వర్తిస్తుంది. దీనివల్ల కొన్ని నెలలపాటు రుణ గ్రహీతలకు ఆర్థిక భారం కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ, మారటోరియం గడువు పూర్తయిన తరువాత మారటోరియం కాలంలో  ఈఎంఐలపై  కట్టాల్సిన వడ్డీని ప్రిన్స్‌పల్‌ మొత్తంతో కలపడం వల్ల ఈఎంఐలపై మరింత భారం పెరుగుతుందన్నారు.

ఎమర్జెన్సీ ఫండ్‌..
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత రుణాల కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం దాచుకున్న నగదును ఈ సమయంలో ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉపయోగించుకోవడం మంచిది. ఎటువంటి సేవింగ్స్‌గానీ, ఎమర్జెన్సీ ఫండ్స్‌ గాని లేనివారు మాత్రమే వ్యక్తిగత రుణాలుతీసుకోవాలని ఆయన చెబుతున్నారు. ఈసందర్భంలో భవిష్యత్తులో వచ్చే ఈఎంఐ భారం మోయక తప్పదన్నారు. రుణాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, మరేఇతర రకాల ఆప్షన్స్‌ లేనప్పుడు మాత్రమే వ్యక్తిగత రుణం తీసుకోవాలని దేవ్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement