సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి షాకింగ్ విషయాలువెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో పీఎన్‌బీ టాప్ అధికారి, ఆర్‌బీఐ ముఖ్య అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పీఎన్‌బీ ఛైర్మన్ సహా, ఆర్‌బీఐ ఉన్నతాధికారులను సీబీఐ దృష్టి పెట్టిందని మనీ కంట్రోల్ రిపోర్ట్ చేసింది. వేలకోట్ల అవినీతిని ఆయా బ్యాంకు శాఖల ఇంటర్నల్ ఆడిటింగ్ సందర్భంగా ఆర్‌బీఐ ఎందుకు కనిపెట్టలేదనే విషయాన్ని సీబీఐ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అలాగే సీబీఐకి ఫిర్యాదు చేసిన అంశాన్ని ఎక్సేంజీలకు వెల్లడించడం తమ విచారణలో అడ్డంకిగా మారిందని పేర్కొంది. అంతేకాదు ఈ విషయంలో నిందితులను అప్రమత్తం చేయాల్సిన అవసరలేదని వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులతో సహా ఈ మెగా స్కాంలో ఎవ్వరూ విడిచిపెట్టేదిలేదని సీబీఐ పునరుద్ఘాటించినట్టు నివేదించింది.
ఇది ఇలా ఉంటే నీరవ్‌మోదీ, గీతాంజలి గ్రూపుల సంస్థలపై ఈడీ దాడులు మూడవరోజు కూడా కొనసాగాయి. శనివారం మరో రూ.25కోట్ల విలువైన డైమండ్, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, దీంతో మొత్తం విలువ రూ. 5,674 కోట్లకు చేరిందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
అటు ఈ భారీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ విచారణను డిమాండ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రతిపక్షపార్టీలతో చర్చించనుంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జిజెఇపిసి) పీఎన్‌బీ స్కాంనుతీవ్రంగా ఖండించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.
మరోవైపు ఇప్పటికే బ్యాంకు నియంత్రణ వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకున్నామని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన అనంతరం సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్‌కు తరలించింది.
Comments
Please login to add a commentAdd a comment