జీఎంఆర్ విద్యుత్ ప్లాంటు టారిఫ్ పెంపు | Power boost for GMR Infrastructure | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ విద్యుత్ ప్లాంటు టారిఫ్ పెంపు

Published Thu, Nov 19 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

Power boost for GMR Infrastructure

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు చెందిన ఒడిసాలోని కమళంగా ఎనర్జీ ప్లాంటు విద్యుత్ టారీఫ్‌లను పెంచుతూ సెంట్రల్ ఎలక్ట్రిసీటీ రెగ్యులేటర్ కమిషన్ (సీఈఆర్‌సీ) ఉత్తర్వులు జారీచేసింది. ఆర్థిక ఏడాది 2013-14లో యూనిట్‌కు రూ. 3.97, ఆ తర్వాత నుంచి రూ. 3.40 వసూలు చేసుకోవడానికి సీఈఆర్‌సీ అనుమతించింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ టారిఫ్ సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. సీఈఆర్‌సీ నిర్ణయంతో రావాల్సిన బకాయిల్ని జీఎంఆర్ గ్రిడ్కో నుంచి వసూలు చేసుకోగలుగుతుంది. ఈ ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నంత కాలం యూనిట్‌కు రూ. 2.75 మాత్రమే లభించేది. తాజా వార్తల నేపథ్యంలో జీఎంఆర్ షేరు 7 శాతం లాభంతో రూ. 14.25 వద్ద ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement