ఆపిల్ ఐఫోన్6 కోసం క్యూ కట్టారు! | Queue began for Apple Iphone6 | Sakshi
Sakshi News home page

ఆపిల్ ఐఫోన్6 కోసం క్యూ కట్టారు!

Published Sun, Sep 7 2014 3:22 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఆపిల్ ఐఫోన్6 కోసం క్యూ కట్టారు! - Sakshi

ఆపిల్ ఐఫోన్6 కోసం క్యూ కట్టారు!

వాషింగ్టన్: ఆపిల్ ఐఫోన్ 6 ను సొంతం చేసుకోవడం కోసం వినియోగదారులు తహతహలాడుతున్నారు. గత 10 రోజల క్రితం ఆపిల్ ఐఫోన్ 6 వెర్షన్ ఫోన్ విడుదలపై కంపెనీ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ప్రకటన వెలువడిన వెంటనే ఈ క్రేజి ఫోన్ ను దక్కించుకునేందుకు  పలు హోల్ సేల్ కంపెనీలు ఆపిల్ స్టోర్ సమీపంలోని షాపులను అద్దెకు తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హోల్ సేల్ కంపెనీల ప్రయత్నాలను వాష్టింగ్టన్ లోని టీవీ కంపెనీలను, టూరిస్టులను ఆశ్చర్యానికి గురి చేస్తోందని వాషింగ్టన్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
సెప్టెంబర్ 9 తేదిన  ఐఫోన్ 6 విడుదలపై ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆపిల్ కంపెనీ ఓ ప్రకటన చేసింది. కాని ఐఫోన్6 తోపాటు ఐవాచ్,, ఐవాలెట్ లాంటి  ప్రోడక్ట్, ఆప్ ను ఆకార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకోవడంతో ఆసంస్థ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున హడావిడి మొదలైంది. ఒకవేళ ఆపిల్ ఐఫోన్ సెప్టెంబర్ 6న విడుదలైనా..రిటైల్ స్టోర్స్ లో లభ్యమవ్వడానికి మరో వారం పట్టవచ్చని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement