మళ్లీ బోధనకు సిద్ధమైన రాజన్... | Raghuram Rajan returns at Chicago Booth School, will teach international corporate finance | Sakshi
Sakshi News home page

మళ్లీ బోధనకు సిద్ధమైన రాజన్...

Published Mon, Sep 19 2016 2:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

మళ్లీ బోధనకు సిద్ధమైన రాజన్...

మళ్లీ బోధనకు సిద్ధమైన రాజన్...

న్యూయార్క్: ఆర్‌బీఐ గవర్నర్‌గా తనదైన ముద్రవేసి ఈ నెల 4న పదవీ విరమణ చేసిన రఘురామ్ రాజన్... తన మునుపటి వృత్తి బోధనను త్వరలోనే చేపట్టనున్నారు. అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నేషనల్ కార్పొరేట్ ఫైనాన్స్ అనే అంశంపై విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. ఈ మేరకు 2016-17 సంవత్సరానికి సంబంధించి రాజన్ కోర్స్ షెడ్యూల్ వివరాలను చికాగో బూత్ స్కూల్ ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక రంగం మరింతగా అనుసంధామై ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఎదురయ్యే సవాళ్లపై రాజన్ బోధన ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement