సాక్షి, ముంబై: రైల్వే శాఖ తమ ఉద్యోగులకు భారీ ఊరట కల్పించింది. వ్యాధితో బాధపడుతున్న పిల్లలచికిత్స నిమిత్తం వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు కూడా రైళ్లలో ఉచితంగా ప్రయాణించే వెసులు బాటును కల్పించింది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న రైల్వే సేవకులకు (పాస్) నిబంధనలను సడలించింది. తమ పిల్నల్ని చికిత్స కోసం ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి వస్తే..ఇక మీదట రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది.
గతంలోని పాస్ రూల్స్ లో ఉన్న నిబంధనల ప్రకారం, రైల్వే ఉద్యోగికి చెందిన పిల్లలు మంచానికి పరిమితమైనా, లేదా కూర్చోలేని స్థితిలో ఉన్నా చికిత్స నిమిత్తం వారి వెంట ఒక వ్యక్తి మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది. అదీ వైద్య అధికారి సిఫారసు మీద మాత్రమే. బిడ్డ తల్లిదండ్రుల సమక్షంలో సురక్షితంగా ఉంటుందనీ, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు, వారి అవసరం చాలా ఉంటుందని రైల్వే మంత్రి పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్లో ఉన్న నిబంధనలను సవరించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే సర్వెంట్స్ (పాస్) రూల్స్ VII (స్పెషల్ పాస్స్), 1986 నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment