న్యూఢిల్లీ : ఫార్మా కంపెనీ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ మోహన్ సింగ్ ఆయన సోదరుడు శివిందర్ మోహన్ సింగ్ ఢిల్లీ నివాసాలపై గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేపట్టారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఫిర్యాదుపై ఈడీ వారి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
కాగా, సింగ్ సోదరులపై గత ఏడాది డిసెంబర్‌లో రెలిగేర్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్ ఢిల్లీ పోలీసులు, ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ కేసు నమోదు చేసింది. వీరు ఇద్దరూ రూ 740 కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధులను దారి మళ్లించారని అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment