'జంగిల్ వెంచర్స్'లో రతన్ టాటా | Ratan Tata to join Jungle Ventures as Special Advisor | Sakshi
Sakshi News home page

'జంగిల్ వెంచర్స్'లో రతన్ టాటా

Published Thu, Jul 2 2015 11:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

'జంగిల్ వెంచర్స్'లో రతన్ టాటా

'జంగిల్ వెంచర్స్'లో రతన్ టాటా

ముంబై: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా... కేపిటల్ ఫండ్ కంపెనీ జంగిల్ వెంచర్స్ బోర్డు ప్రత్యేక సలహాదారుగా వ్యవరించనున్నారు. అనురాగ్ శ్రీవాస్తవ, అమిత్ ఆనంద్ స్థాపించిన జంగిల్ వెంచర్స్ సింగపూర్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో 30  స్టార్ట్-అప్ లలో జంగిల్ వెంచర్స్ పెట్టుబడులు పెట్టింది. 

బోర్డు ప్రత్యేక సలహాదారుగా ఉండేందుకు రతన్ టాటా అంగీకరించారని జంగిల్ వెంచర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసేందుకు రతన్ సేవలు వినియోగించుకుంటామని వెల్లడించింది. ఆసియా, అంతర్జాతీయ స్థాయిలో నైతికంగా, సాంస్కృతికంగా బలపడేందుకు రతన్ సలహాలు తమకు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement