ఇక బ్యాంకింగ్ అంతర్గత అంబుడ్స్‌మన్: ఆర్‌బీఐ
ముంబై: బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వినియోగదారుల ఫిర్యాదుల తక్షణ పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్ఘాటించింది. ప్రభుత్వ రంగంతో పాటు దిగ్గజ ప్రైవేటు రంగ, విదేశీ బ్యాంకులు అంతర్గత అంబుడ్స్‌మన్ నియామకాలు చేసుకోవాలని ఆదేశించింది. ఇంటర్నల్ అంబుడ్స్‌మన్‌ను చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (సీసీఎస్‌ఓ)గా వ్యవహరిస్తారు. కాగా బ్యాంక్ నియమించిన అంబుడ్స్‌మన్, అంతకుముందు అదే బ్యాంకులో పనిచేసి ఉండకూడదని ఆర్‌బీఐ నిర్దేశించింది. ఫిర్యాదు సత్వర, నాణ్యతాపూర్వక పరిష్కారం లక్ష్యంగా ఈ చొరవ తీసుకుంటున్నట్లు (అంతర్గత అంబుడ్స్‌మన్) ఆర్‌బీఐ తెలిపింది.