న్యూఢిల్లీ: డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)లపై కొనుగోలు చేస్తున్న వారి పేరు కూడా ఉండాలని అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. దీంతో పే ఆర్డర్, బ్యాంకర్స్ చెక్, డీడీలపై కొనుగోలు చేసే వారి పేరు కూడా ఇకపై కనిపించనుంది. కేవైసీ నిబంధనల్లో ఆర్‌బీఐ ఈ మేరకు అవసరమైన మార్పులు కూడా చేసింది.
డీడీలను మనీ ల్యాండరింగ్‌కు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో డీడీలు, బ్యాంకర్స్ చెక్, పే ఆర్డర్‌పై కొనుగోలుదారు పేరును కూడా పేర్కొనాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇక, ఆర్‌బీఐ నిబంధనల మేరకు డీడీ, ఎన్‌ఈఎఫ్‌టీ/ఐఎంపీఎస్ లేదా ఏదేనీ ఇతర మాధ్యమం ద్వారా చేసే చెల్లింపులు రూ.50,000 అంతకంటే ఎక్కువ ఉంటే... నగదు ద్వారా కాకుండా చెక్, బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి డెబిట్ ద్వారానే అనుమతించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment