ఆర్కామ్ నుంచి కొత్త వ్యాన్ ప్రొడక్ట్ | RCom expands enterprise product portfolio with Cloud X WAN | Sakshi
Sakshi News home page

ఆర్కామ్ నుంచి కొత్త వ్యాన్ ప్రొడక్ట్

Aug 25 2016 1:06 AM | Updated on Sep 4 2017 10:43 AM

ఆర్కామ్ నుంచి కొత్త వ్యాన్ ప్రొడక్ట్

ఆర్కామ్ నుంచి కొత్త వ్యాన్ ప్రొడక్ట్

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా సాఫ్ట్‌వేర్ ఆధారిత వ్యాన్ (వైడ్ ఏరియా నెట్‌వర్క్) ప్రొడక్ట్ ‘క్లౌడ్ ఎక్స్ వ్యాన్’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా సాఫ్ట్‌వేర్ ఆధారిత వ్యాన్ (వైడ్ ఏరియా నెట్‌వర్క్) ప్రొడక్ట్ ‘క్లౌడ్ ఎక్స్ వ్యాన్’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీన్ని కంపెనీ అనుబంధ సంస్థ గ్లోబల్ క్లౌడ్ ఎక్స్చేంజ్ రూపొం దించింది. బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, ఇతర కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆర్‌కామ్ ఈ ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. మేకిన్ ఇండియా తొలి క్లౌడ్ సెంట్రిక్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ ఇది.

హెడ్ ఆఫీస్‌లోని క్లౌడ్ సర్వర్ నుంచి వచ్చే అప్‌డేట్స్‌తో నిమిత్తం లేకుండా కంపెనీ బ్రాంచులు ఈ కొత్త ప్రొడక్ట్ సాయంతో స్వతహాగా కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని ఆర్‌కామ్ ఎంటర్‌ప్రైజ్, జీసీఎక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్రహమ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఎస్‌డీ వ్యాన్‌లకు డిమాండ్ పెరుగుతోందని, తమ ‘క్లౌడ్ ఎక్స్ వ్యాన్’తో కంపెనీల డేటా సేవింగ్ వ్యయం తగ్గుతుందని ఆర్‌కామ్ ఎంటర్‌ప్రైజ్, జీసీఎక్స్ సీఈవో బిల్ బర్నే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement