
బంగారు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు
బంగారం దిగుమతిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించనుంది.
న్యూఢిల్లీ: బంగారం దిగుమతిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించనుంది. దీపావళి పండగ తర్వాత ఈ విషయంపై దృష్టిసారించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బంగారం దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. దీపావళి సీజన్ సందర్భంగా ఎలాంటి చర్యలూ తీసుకోబోమని, పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు.