కంపెనీల చట్టాన్ని తిరగరాయాలి | Reversal of companies apply the law | Sakshi
Sakshi News home page

కంపెనీల చట్టాన్ని తిరగరాయాలి

Published Thu, Aug 6 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

కంపెనీల చట్టాన్ని తిరగరాయాలి

కంపెనీల చట్టాన్ని తిరగరాయాలి

 ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ ఎంకే శర్మ
 
 ముంబై : కంపెనీల చట్టంలో నిబంధనలను కఠినతరం చేయడమనేది ప్రమోటర్లకు శాపంగా మారిందని ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్‌గా కొత్తగా నియమితులైన ఎంకే శర్మ వ్యాఖ్యానించారు.  సత్యం కంప్యూటర్స్, సహారా గ్రూప్ లాంటి కొన్ని కుంభకోణాల కేసుల వల్ల మిగతా అందరినీ శిక్షిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. అభివృద్ధికి దోహదపడటం కన్నా కేవలం నిబంధనలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ చట్టం.. కంపెనీల కోసం కన్నా, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల కోసమే రాసినట్లుగా కనిపిస్తోందన్నారు. డెరైక్టర్ల విధుల విషయంలోనూ నిబంధనలు తీవ్రంగా ఉన్నాయని శర్మ చెప్పారు.

ఈ నేపథ్యంలో చట్టాన్ని తక్షణమే తిరగరాయాల్సిన అవసరం ఉంద ని పేర్కొన్నారు. ఇందుకోసం ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ తదితర పరిశ్రమ వర్గాలతో మరోసారి సంప్రతింపులు జరపాలని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. చట్టం అనేది నియంత్రణ పాత్ర పోషిస్తూనే అభివృద్ధికి ఊతమిచ్చేలా కూడా ఉండాలని శర్మ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐకి పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement