పరిమితి శ్రేణిలో చాలా రోజుల పాటు కదిలిన రూపాయి ఈ వారంలో హఠాత్తుగా 3నెలల గరిష్టాన్ని తాకింది.భారత్ ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరగడం, ఆర్‌బీఐ డాలర్ల కొనుగోలును క్రమంగా తగ్గించుకుటుందనే కారణంగా డాలర్‌మారకంలో రూపాయి విలువ పెరిగింది.
భారత్ చెల్లింపుల బ్యాలెన్స్ మిగులు కొన్నేళ్లలో బాగా బలపడింది. ఇది భారత కరెన్సీ రూపీ బలపడేందుకు మద్దతునిచ్చింది. ఆర్‌బీఐ తన నిల్వలను పెంచుకొనే అవకాశం ఉన్నప్పటికీ.., చారిత్రాత్మకంగా, అది నిల్వలను సంబంధించి ఎలాంటి నిర్దిష్ట స్థాయిలను లక్ష్యంగా చేసుకోలేదు.’’ అని ఏషియన్ సౌత్ ఆసియా ఎఫ్‌ఎక్స్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ దివ్యా దేవేశ్ తెలిపారు. ఫారెక్స్ నిల్వలు పెంచుకోవడం ద్వారా రూపాయి ర్యాలీని నెమ్మదిగా సాగవచ్చు కానీ డాలర్ బలహీనత కారణంగా రూపాయి పెరగడం మాత్రం ఆగదు. యూఎస్‌డీ-ఐఎన్‌ఆర్ మారకంలో 73.50 టార్గెట్ ధరగా షార్ట్ చేసుకోవచ్చని దినేష్ ఇన్వెస్టర్లకు సలహానిస్తున్నారు.
ఆసియా అన్ని దేశాల్లో కెల్లా ఈ జూన్ త్రైమాసికంలో భారత స్టాక్స్‌లోకి అత్యధికంగా రూ.4.2బిలియన్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయి. కేవలం ఒక్క రిలయన్స్ తన జియోలో వాటా విక్రయం ద్వారా గత 11 వారాల్లో 12 విదేశీ దిగ్గజ సంస్థల నుంచి 16 బిలియన్ డాలర్లను ఆకర్షించగల్గింది.
భారత్‌లోకి ఇన్‌ఫ్లో భారీగా ఉన్నప్పటికీ, ఆర్‌బీఐ నిల్వలను పెంచుకునేందుకు డాలర్లను నిరంతరం కొనుగోలు చేసింది. ఫలితంగా ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 500 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ ప్రకారం, జూన్ 19 నుంచి ఏడువారాల్లో 17.2 బిలియన్ డాలర్లు కొనుగోలు చేయాలని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు అడపాదడపా డాలర్ల కొనుగోలు చేసిన వైనాన్ని ట్రేడర్లు ఉదహరిస్తున్నారు.
శుక్రవారం ట్రేడింగ్ ఇలా :
గురువారం నాటి ముగింపు(75.04)తో పోల్చితే రూపాయి శుక్రవారం నాడు 44 పైసల లాభంతో 74.60 వద్ద ఆరంభమైంది. రిలయన్స్ జియోలో వాటాలను విదేశీ సంస్థలకు అమ్మడంతో భారత్‌లోకి డాలర్ల రూపంలో ఇన్‌ఫ్లో మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఆర్‌బీఐ డాలర్ల కొనుగోలుకు కొద్దిరోజులు దూరంగా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు అంశాలు శుక్రవారం రూపాయి ట్రేడింగ్‌ను నడిపించాయి. ఫలితంగా ఇంట్రాడేలో 74.60-75.02 శ్రేణిలో కదలాడిన రూపాయి చివరకు 38 పైసల లాభంతో 74.66 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం మీద రూపాయి 1.3శాతం బలపడింది.విదేశీ ఫ్లో రాకతో కరెంట్-ఖాతా మిగులు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా దిగివచ్చిన ముడిచమురు ధరలు రూపాయి అవుట్‌లుక్‌ను మరింత పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment