
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి లాభాల్లో ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల దన్ను, డాలరు బలహీనత నేపథ్యంలో మంగళవారం డాలరు మారకంలో రూపాయి 17 పైసలు 74.74 వద్ద స్థిరపడింది. 74.79 వద్ద పాజిటివ్ నోట్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 74.73 ని, 74.87 వద‍్ద కనిష్టాన్ని తాకింది. చివరికి మునుపటి సెషన్‌లోని 74.91తో పోలిస్తే 74.74 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.03 శాతం పడిపోయి 95.80కి చేరుకుంది. (భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్)
సానుకూల దేశీయ ఈక్విటీలు, కోవిడ్-19 వ్యాక్సిన్ ఆశలు రూపాయికి మద్దతు ఇచ్చాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు సెన్సెక్స్ 557 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 156 పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి. కాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ మొదటి దశ మానవ పరీక్షల ఫలితాలపై ఆశావహ ధోరణి వ్యక్తమైంది. అలాగే భారత దేశ తొలి వ్యాక్సిన్ కోవాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment