
డాలర్ డ్రీమ్స్.. రూపాయి క్రాష్
బ్రెగ్జిట్ ప్రకంపనలతో రూపాయి విలవిల్లాడింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలడం, డాలర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవటంతో డాలరుతో రూపాయి
71 పైసలు డౌన్; 67.96 వద్ద క్లోజ్
ముంబై: బ్రెగ్జిట్ ప్రకంపనలతో రూపాయి విలవిల్లాడింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలడం, డాలర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవటంతో డాలరుతో రూపాయి మారకం విలువ నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం ఒక్క రోజే 71 పైసలు ఆవిరై.. 67.96 వద్ద ముగిసింది. 2015, ఆగస్టు 24 తర్వాత ఒకే రోజు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో 67.78- 68.22 శ్రేణిలో రూపాయి కదలాడింది. ఇప్పటివరకూ డాలరుతో రూపాయి ఆల్‌టైమ్ కనిష్టస్థాయి 68.7
పౌండ్ క్రాష్...
బ్రెగ్జిట్ ప్రభావం కారణంగా పౌండ్‌తో రూపాయి మారకం విలువ 8% ఎగబాకి 93.13కు చేరింది. గడిచిన వారం రోజుల్లో పౌండు ధర రూపాయితో పోలిస్తే 103 నుంచి 93.13కు రావటం గమనార్హం. ఇక యూరోతో పోలిస్తే రూపాయి విలువ కూడా 2.4 శాతం ఎగసి 74.8 వద్ద స్థిరపడింది.