రూపాయి
ముంబై : గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు, దేశీయ స్టాక్‌మార్కెట్లలో నెలకొన్న భారీ పతనం, రూపాయిపైనా ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే.. దేశీయ రూపాయి ఏడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత ముగింపు 0.46 శాతం నష్టపోయిన దేశీయ కరెన్సీ 64.36 వద్ద ట్రేడైంది. ప్రారంభంలో అత్యంత కనిష్ట స్థాయి 64.40ను కూడా తాకింది. గతేడాది డిసెంబర్ 18 తర్వాత రూపాయి ఈ మేర క్షీణించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 31 పైసలు బలహీనపడి 64.37 వద్ద ట్రేడవుతోంది. స్టాక్‌మార్కెట్లు భారీగా పతనం కావడంతో, రూపాయి విలువ కూడా దిగజారింది.
అమెరికన్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ భారీగా 1250 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ సైతం 350 పాయింట్ల మేర క్రాష్ అయింది. అమెరికన్ స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం భారీగా పతనమయ్యాయి. డోజోన్స్, ఎస్ అండ్ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేట్ 1100 పాయింట్లు పూడిపోయి ఆరున్నరేళ్లలో మొదటిసారి అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. అమెరికా వేతన డేటా, క్రెడిట్ రేటింగ్ డౌన్‌గ్రేటింగ్ చేసిన ప్రభావంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఈ మేర కిందకి దిగజారాయి. దేశీయంగా బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను భయాలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, అమెరికా మార్కెట్ల ప్రభావం వంటివి మన మార్కెట్లను పడగొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment