
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనలిటిక్స్, డేటా సర్వీసుల రంగంలో ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్ హైదరాబాద్‌లో కొత్త ‘ఓరియన్’ కార్యాలయాన్ని ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రానికి రూ.70 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశామని కంపెనీ ఇండియా ఎండీ అభిషేక్ తోమర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 700 మంది సపోర్ట్ సిబ్బంది ఓరియన్‌లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌కు హైదరాబాద్‌లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీ వద్ద ఒక కార్యాలయం ఉంది. ఇందులో 3,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంతే స్థాయిలో అత్యాధునిక వసతులతో నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తామని అభిషేక్ వెల్లడించారు. హైటెక్ సిటీ కార్యాలయం నుంచి ఈ సెంటర్‌కు కార్యకలాపాలను బదిలీ చేస్తామన్నారు. ఓరియన్ సెంటర్ కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అహ్మదాబాద్, గురుగ్రామ్‌తోసహా భారత్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య సుమారు 8,000.
Comments
Please login to add a commentAdd a comment