ఎస్‌బీఐ భారీ ఆన్‌లైన్ ప్రాపర్టీ వేలం
ముంబై: మొండి బకాయిల బరువును తగ్గించుకోవడానికి ఎస్‌బీఐ ఈ వారంలో ఆన్‌లైన్ ప్రాపర్టీ వేలాన్ని నిర్విహంచనుంది. ఇది దేశంలో అత్యంత పెద్ద ఆన్‌లైన్ వేలం. ఎస్‌బీఐ ఇప్పటివరకూ స్వాధీనపర్చుకున్న ఆస్తుల్లో నుంచి ఈ వేలంలో దాదాపు 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) విలువైన కార్యాలయాలను, ఫ్లాట్లను విక్రయించనుంది. దేశంలోని వివిధ 24 నగరాల్లో 300 రకాల ఆస్తుల్ని వేలం వేయనుంది. ఎస్‌బీఐ మొండిబకాయిలు దాదాపు 10 బిలియన్ డాలర్లకు (రూ. 62,500 కోట్లు) పైగా ఉన్నాయి. ఈ వేలం కోసం ఎదురుచూస్తున్నామని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ ప్రవీణ్ కుమార్ మల్హోత్రా అన్నారు.