సొంతింటి ఎంపికలో కీలకమివే! | School and hospital is importan to select a new house | Sakshi
Sakshi News home page

సొంతింటి ఎంపికలో కీలకమివే!

May 5 2018 12:20 AM | Updated on Sep 15 2018 4:12 PM

School and hospital is importan to select a new house - Sakshi

ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లలో క్లబ్‌ హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, ఏసీ జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆసుపత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్‌ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్‌ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్‌ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ :  సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆసుపత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలను పంపించడంలో తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తుంది.

పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆసుపత్రి ఉందా? వంటి అంశాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్‌ హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్‌ ఆవరణలోనే పాఠశాల, ఆసుపత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్‌ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

శరవేగంగా అభివృద్ధి..
కొనుగోలుదారుల అభిరుచిలో వచ్చిన మార్పుతో ఆయా ప్రాజెక్ట్‌లుండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్‌ ఆవరణలో పాఠశాలలు, ఆసుపత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు.

కొన్ని కంపెనీలైతే ప్లే స్కూళ్లు, రీసెర్చ్‌ సెంటర్లకూ ప్రాజెక్టుల్లోనే స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆసుపత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్‌ మాళ్లు, మల్టీప్లక్స్‌ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు రియల్‌ బూమ్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.

కీలకమే కానీ..
వర్షాకాలంలో కొనుగోలుదారులు ఇంటిని కొనడానికి సైటు వద్దకెళితే రవాణా సదుపాయాల గురించి పక్కాగా తెలుస్తుంది.  
 ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందా? స్థానిక రైళ్లను సులువుగా అందుకోవచ్చా? ఇలాంటి అంశాలన్నీ వానాకాలంలోనే పక్కాగా తెలుస్తాయి.
వర్షాకాలంలో అయితే ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతం ముంపులో ఉందా? లేక గడ్డ మీద ఉందా అనే విషయం ఇట్లే తెలిసిపోతుంది. వానలు పడితే ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతమంతా నీరుతో నిండిపోతుందా? అనే అంశం టోకెన్‌ అడ్వాన్స్‌ ఇచ్చే ముందే తెలుసుకోవచ్చు.  
 నిర్మాణ పనులు ఆరంభమైనా నిర్మాణం చివరి స్థాయిలో ఉన్నా వర్షాకాలంలో వెళితే ఆయా కట్టడం వర్షాలకు గట్టిగా నిలుస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది.
 గోడల్లో పగుళ్లు ఉన్నా, వర్షం నీరు కారుతున్నా పరీక్షించడానికి ఇంతకు మించిన సమయం లేదని గుర్తుంచుకోండి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement