‘పాన్కార్డ్ క్లబ్స్’ సంస్థ ఖాతాల జప్తు
రూ.7,035 కోట్ల బకాయిల వసూలుకు సెబీ చర్యలు
న్యూఢిల్లీ: అక్రమంగా నిధులు సమీకరించిన కేసులో పాన్‌కార్డ్ క్లబ్స్ లిమిటెడ్‌తోపాటు, ఆ సంస్థ డెరైక్టర్లపై సెబీ చర్యలు ప్రారంభించింది. రూ.7,035 కోట్ల బకారుుల వసూలుకు గాను కంపెనీతోపాటు, ఆరుగురు డెరైక్టర్లకు చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశించింది. పాన్‌కార్డు క్లబ్స్‌కు బకారుు పడిన 10 అనుబంధ కంపెనీల బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాల (సీఐఎస్) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన రూ.7,000 కోట్లను తిరిగి చెల్లించాలని పాన్‌కార్డు క్లబ్స్‌ను సెబీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించింది. అసలుతో పాటు, వడ్డీ, ఇతర చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంది. అరుుతే, ఈ ఆదేశాల అమలులో విఫలం కావడంతో సెబీ తాజా చర్యలకు దిగింది.