'బేర్'ఎటాక్!
• సెన్సెక్స్ 514 పాయింట్లు డౌన్
• ఆరు నెలల కనిష్ట స్థారుు ఇది 8,200 దిగువకు నిఫ్టీ
• పెద్ద నోట్ల రద్దు, ట్రంప్ గెలుపు ప్రభావం
• తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు; రూపాయి పతనం
• ఫెడ్ రేట్ల పెంపు భయాలు పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల హవా
స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నారుు. అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం స్టాక్ సూచీలు భారీగా నష్టపోయారుు.అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అనుసరించనున్న విధానాలతో ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దాంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందని భయాలు, రూపారుు 49 పైసలు పతనం కావడం, పెద్ద నోట్ల కారణంగా నగదు కొరత ఏర్పడడం తదితర అంశాలు తీవ్రమైన ప్రభావం చూపారుు. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆరు నెలల కనిష్టానికి, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,200 పారుుంట్ల దిగువకు పడిపోయారుు. నిఫ్టీ ఇంట్రాడేలో 8,100 పారుుంట్ల దిగువను తాకింది.
అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండడం, డాలర్ 14 ఏళ్ల గరిష్ట స్థారుుకి చేరువ కావడం, విదేశీ నిధులు తరలిపోతుండడం, బ్లూ చిప్ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం తదితర అంశాలు.. అగ్నికి ఆజ్యం పోశారుు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 514 పారుుంట్లు నష్టపోరుు 26,305 పారుుంట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 188 పారుుంట్లు (2.26%)నష్టపోరుు 8,108 పారుుంట్ల వద్ద ముగిశారుు. వాహన, ప్రైవేట్ బ్యాంక్, ఆర్థిక, రియల్టీ, లోహ షేర్లు కుదేలయ్యారుు. రూపాయి పతనం ప్రభావంతో విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్లు జరిగారుు. పెద్ద నోట్ల రద్దు కారణంగా డిపాజిట్లు ఎగబాకడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడ్డారుు.
మన దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం గత నెలలో 3.39 శాతానికి తగ్గింది.ఇది నాలుగు నెలల కనిష్ట స్థారుు. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం ఇది వరుసగా రెండో నెల. అరుునా ఈ అంశం పెద్దగా ప్రభావం చూపలేకపోరుుంది.పెద్ద నోట్ల రద్దు కారణంగా స్వల్ప కాలంలో భారత్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ వ్యాఖ్యానించడం మరింత ప్రతికూల ప్రభావం చూపింది. చివరకు 514 పారుుంట్ల(1.92 శాతం) నష్టంతో 26,305 పారుుంట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 188 పారుుంట్లు (2.26 శాతం)నష్టపోరుు 8,108 పారుుంట్ల వద్ద ముగిసింది. జూన్ 27 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థారుు. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.67 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్3.91 శాతం చొప్పున కుదేలయ్యారుు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,200 పారుుంట్లు, నిఫ్టీ 416 పారుుంట్ల చొప్పున నష్టపోయారుు.
ఎన్‌బీఎఫ్‌సీలు కుదేల్...: పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత కారణంగా పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు షేర్లు కుదేలయ్యారుు. కెన్‌ఫిన్‌హోమ్స్, శ్రీరామ్ సిటి, ఉజ్జీవన్ మణప్పురం ఫైనాన్‌స, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్‌స షేర్లు 5-20 శాతం రేంజ్‌లో పడిపోయారుు.
టాటా మోటార్స్ బ్రేక్ డౌన్...
సెప్టెంబర్ క్వార్టర్‌లో స్టాండోలోన్ నికర నష్టాలు రూ.631 కోట్లకు పెరగడంతో టాటా మోటార్స్ షేర్ 10 శాతం క్షీణించి రూ.457వద్ద ముగిసింది. రూ.15,058 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోరుుంది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోరుున షేర్ ఇదే. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బ్యాంక్ ఆఫ్‌బరోడా 9 శాతం, కార్పొరేషన్ బ్యాంక్ 13 శాతం చొప్పున పెరిగారుు. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు నష్టపోయారుు 10 షేర్లు లాభపడ్డారుు. . ఏషియన్ పెరుుంట్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 2-7% రేంజ్‌లో పడిపోయారుు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో 1.5 శాతం వరకూ పెరిగారుు. బీఎస్‌ఈలో 2,354 షేర్లు నష్టపోగా, 346 షేర్లు లాభపడ్డారుు.
ఐదు నెలల కనిష్టానికి రూపారుు.. 49 పైసల నష్టంతో 67.74 వద్ద ముగింపు
ముంబై: డాలర్‌తో రూపారుు మారకం మంగళవారం 49 పైసలు క్షీణించి 67.74 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థారుు. ఇంట్రాడేలో తాజా కనిష్ట స్థారుు, 67.85ను తాకింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటంతో డాలర్లకు డిమాండ్ బాగా పెరగడంతో రూపారుు ఈ స్థారుులో పతనమైంది. డాలర్ బలపడుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ ట్రేడర్లు తమ పోర్ట్‌ఫోలియోలను భారీగా ఆఫ్‌లోడ్ చేయడం, భారత్‌లో పెట్టుబడుల పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో వృద్ధికి విఘాతం కలుగుతుందన్న అంచనాలు, పెద్ద నోట్లను రద్దు చేయడం, స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడం తదితర అంశాలు తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపారుు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ అనూహ్యంగా గెలవడం, వృద్ధి జోరు పెంచేలా ప్రభుత్వ వ్యయం పెంచే విధానాలను ఆయన తీసుకురానున్నారని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాతో డాలర్ బలపడుతూ వస్తోంది.
ఎందుకీ పతనం..
పెద్ద నోట్ల రద్దు ప్రభావం
పెద్ద నోట్ల రద్దు కారణంగా నగదు కొరత తీవ్రమవుతుందని, పెద్ద నోట్లను రద్దు చేయడం సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులంటున్నారు. పెద్ద నోట్లు రద్దయి రెండో వారం ప్రారంభమైనప్పటికీ, నగదు కొరత తీవ్రత వివిధ రంగాల్లో కొనసాగుతోం దని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫిన్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ చెప్పారు. డిపాజిట్ల జోరు కారణంగా గత వారంలో ప్రభుత్వ బ్యాంక్ షేర్లు పెరిగాయని, మొండి బకారుుల ప్ర భావం కారణంగా ఈ పెరుగుదల కొనసాగకపోవచ్చని పేర్కొన్నారు.
తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,854 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. మంగళవారం ఒక్కరోజే రూ.2,354 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు.
ట్రంప్ ఎఫెక్ట్..
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రభుత్వ వ్యయం జోరును పెంచే విధంగా ఉండనున్నాయని, దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందన్న అంచనాలు అధికమయ్యారుు. వృద్ధిని పెంచే ట్రంప్ విధానాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దాంతో ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచుతందన్న అంచనాలూ పెరిగారుు. వడ్డీ రేట్లు అధికమవుతాయనే అంచనాలతో అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతున్నారుు. డాలర్ ఈ ఏడాది నష్టాలన్నింటిని పూడ్చుకొని లాభాల బాట పడుతోంది. డాలర్ పెరగడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించినప్పటి నుంచి ఆసియా దేశాల కరెన్సీలు పతనమై భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి భారీగా విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నారుు. ట్రంప్ గెలిచినప్పటి నుంచి సెన్సెక్స్ 5%, రూపారుు 1.8 శాతం చొప్పున పడిపోయారుు.