భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు | Sensex crashes 538 pts, Nifty below 7,800 on global meltdown | Sakshi
Sakshi News home page

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

Published Mon, Jan 4 2016 2:50 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు - Sakshi

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

ముంబై:   దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రారంభంలోనే నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం దిశగా పయనించాయి.   చైనా ఫ్యాక్టరీ ఉత్పత్తి గణాంకాలు ఈ  డిసెంబర్లో మరింత దిగజారనున్నాయనే అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.  

ఈ క్రమంలోనే సుమారు సెన్సెక్స్ 530 పైగా పాయింట్లను  కోల్పోగా, నిఫ్టీ 170  పాయింట్లు క్షీణంచింది.  ముఖ్యంగా  నిఫ్టీ గట్టిమద్దతు స్థాయి  7800 పాయింట్లకు దిగజారి మరింత బలహీన సంకేతాలను అందజేసింది.   ఆసియా మార్కెట్లలోని పతనం దేశీయ మార్కెట్లను  ప్రభావితం చేస్తోందని, చైనా మార్కెట్లు భారీగా పడిపోవడమే మన మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గత డిశెంబర్ నెలలో భారీ పతనం తరువాత ఈ తరహాలో మార్కెట్లు క్షీణించడం ఇదే మొదటిసారని పేర్కొన్నాయి.  అయితే 7800 పైన నిఫ్టీ గట్టిగా నిలదొక్కుకునే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు  అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా టెలికాం, బ్యాంకింగ్ రంగంలోని నష్టాలు మార్కెట్ను బాగా కృంగదీశాయి.  ఎయిర్ టెల్ , ఐడియా షేర్లలో అమ్మకాల వత్తిడితో .. 3.5 శాతానికి పైగా నష్టాలతో మార్కెట్లను పతనం దిశగా లాక్కెళ్లాయి.   టాటా మోటార్స్, సన్ ఫార్మా, యం  అండ్ యం, ఆయిల్ తదితర రంగాల్లో కూడా ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. అటు యూరోప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే  కొనసాగుతున్నాయి. కాగా పసిడి  ధరలు లాభాలను చవిచూస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement