సాక్షి, ముంబై: అంచనాల కనుగుణంగానే దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై దృష్టి పెట్టిన దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 39 పాయింట్ల లాభంతో 35,575 వద్ద,నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,818 వద్ద కొనసాగుతున్నాయి.. నిఫ్టీ 10800 స్థాయికిపైన కొనసాగుతోంది. ప్రధానంగా ఫార్మా లాభపడుతుండగా మెటల్ నష్టపోతోంది.
ముఖ్యంగా చమురు ధరలు పెరగడంతో హెచ్‌పీసీఎల్, ఐవోసీ టాప్‌విన్నర్స్‌గా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ లాభాల్లోనూ, ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, హిందాల్కో, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంతా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
అటు బులియన్ మార్కెట్లో పుత్తడి సానుకూలంగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. 170 రూపాయలు పుంజుకున్న బంగారం 31,535 వద్ద ఉంది. కరెన్సీ మార్కెట్లో డాలరు మారకంలో 0.09 పైసలు లాభపడిన రూపాయి 67.23 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment