సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభం నుంచీ పటిష్టంగా కదలాడిన కీలకసూచీలు వరుసగా మూడో రోజుకూడా లాభపడి ప్రధాన మద్దతు స్థాయిలకు పైన ముగియడం విశేషం. సెన్సెక్స్ 606 పాయింట్లు ఎగిసి 32720వద్ద, నిఫ్టీ 172పాయింట్లు లాభపడి 9553 వద్ద స్థిరంగా ముగిసాయి. ఆఖరి గంటలో మరింత పుంజుకున్ననిఫ్టీ 9550 స్థాయికి ఎగువన ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్, ఆటో, పార్మ లాభాలు మార్కెట్లకు మద్దతు నిచ్చాయి. సెన్సెక్స్ 783 పాయింట్లు పెరిగి ఇంట్రాడేలో 32,898 గరిష్ట స్థాయిని తాకింది. కాగా రేపు (గురువారం) డెరివేటివ్ సిరీస్ ముగియనుంది.
మెటల్ 4.5శాతం, ఆటో 2 శాతం, పీఎస్‌యు బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ ఒక్కొక్కటి 1.8 శాతం, మీడియా 1.7శాతం, ఐటీ, రియాల్టీ రంగాలు 1.3శాతం ఎగిసాయి. ఫావిపిరవిర్ ఔషధాన్ని సొంతంగా అభివృద్ధి చేసినట్లు స్ట్రైడ్స్ ఫార్మా ప్రకటించడంతో ఈ షేరు 20 శాతం లాభపడింది. హిందాల్కో, గెయిల్ అదానీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హీరోమోటోకార్ప్ టాప్ విన్నర్స్ గా వుండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ ఈ రోజు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్ గా ముగిసింది. చమురు ధరల బలం, డాలరు బలహీనం నేపథ్యంతో ఆరంభంలోనే 35 పైసలు ఎగిసి మూడువారాల గరిష్టాన్ని తాకింది. చివరికి 52 పైసల లాభంతో 75.67 వద్ద ముగిసింది. మంగళవారం 76.19 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.
చదవండి : ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే!
కరోనాపై పోరు : ఏడీబీ భారీ సాయం
Comments
Please login to add a commentAdd a comment