
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు రెండవ సెషన్ లో కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. ఆరంభలో స్వల్పంగా లాభపడినా వెంటనే ఒత్తిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3764 పాయింట్లు క్షీణించి 27806 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు నష్టంతో 8142 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 28వేల స్ఠాయిని, నిఫ్టీ 8150 స్థాయి దిగువకు చేరింది. ఫార్మ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ షేర్లు బలహీనంగా న్నాయి. కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్, హీరో మోటో, టైటన్, ఆసియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంకు బాగా నష్టపోతున్నాయి మార్చి నెలలో అమ్మకాలు పడిపోవడంతో బజాజ్ ఆటో, టాటా మోటార్స్ అశోక్ లేలాండ్, మారుతి లాంటి షేర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. అటు సిప్లా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, గెయిల్, ఐటీసీ, జీ ఎంటర్ టైన్ మెంట్ లాభపడుతున్నాయి.
మరోవైపు డాలరు మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. ప్రారంభంలోనే 39 పైసలు కోల్పోయి 76.08 వద్ద కొనసాగుతోంది కాగా 2021 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు దలాల్ స్ట్రీట్ నష్టాలనే మూటగట్టుకుంది. నిన్న (గురువారం) శ్రీరామ నవమి సందర్శంగా మార్కెట్లకు సెలవు.
Comments
Please login to add a commentAdd a comment