సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో ఆరంభంలోనే భారీగా ఎగిసిన కీలక సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత పటిష్టంగా కదలాయి. చివరకు సెన్సెక్స్ 1265 పాయింట్ల లాభంతో 31159, నిఫ్టీ 350 పాయింట్ల లాభంతో 9111వద్ద పటిష్టంగా ముగిసాయి. దీంతో సెన్సెక్స్ 31 వేలకు ఎగువను, నిఫ్టీ 91వందల పాయింట్ల ఎగువన ముగియడం విశేషం. దాదాపు అన్ని రంగాలు లాభాలనార్జించాయి. మేజర్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయంటేనే లాభాల జోరును అర్థం చేసుకోవచ్చు. స్పైస్‌జెట్, ఫ్యూచర్ రిటైల్, రెయిల్ వికాస్ నిగమ్, ఐఆర్‌సీటీసీ, వొకార్డ్, కేఆర్‌బీఎల్, జుబిలెంట్ లైఫ్‌లు ఇవాళ అప్పర్ సర్క్యూట్‌కు చేరాయి. టాటా మోటార్స్, సిప్లాలు వాల్యూమ్స్ భారీగా లాభపడ్డాయి.
ముఖ్యంగా ఆటో, ఫార్మ, బ్యాంకింగ్ రంగ షేర్లు మార్కెట్ల లాభాలకు ఊతమిచ్చాయి.ఎంఅండ్‌ఎం, మారుతీ సుజూకి 10శాతానికి పైగా లాభపడగా, బజాజ్ ఆటో, హీరోమోటోకార్ప్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్‌లు లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లో సిప్లా, అరబిందో ఫార్మా, లుపిన్, అజంతా ఫార్మా, దివిస్ ల్యాబ్స్, సన్‌ఫార్మాలు లాభపడ్డాయి.వీటిల్లో ఎక్కువ శాతం ఇవాళ బీఎస్‌ఈలో 52 వారాల గరిష్టానికి చేరాయి. కాగా రేపు గుడ్ ప్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు.
Comments
Please login to add a commentAdd a comment