సాక్షి, ముంబై : దేశీయస్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 560 పాయింట్లకు పైగా జంప్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ 32 వేల స్థాయిని, నిఫ్టీ 9350 స్థాయిని అధిగమించాయి. ప్రస్తుతం 505 పాయింట్లు ఎగిసి 31920 వద్ద, నిఫ్టీ 139 పాయింట్లు లాభంతో 9337 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్, హెచ్ యూఎల్, ఐపీఐపీఐ భారీగా లాభపడుతున్నాయి. ఇంకా వేదాంతా, ఇండస్ ఇండ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (రోజంతా వెలవెల బోయిన సూచీలు)
Comments
Please login to add a commentAdd a comment